Parkinsons Disease : పర్యావరణ మార్పులతో యువతను పట్టిపీడిస్తోన్న వణుకుడు వ్యాధి

ఇప్పటివరకు వణుకుడు వ్యాధికి సరైన కారణాన్ని గుర్తించనప్పటికీ జన్యుపరమైన సంబంధ కారణాలదే కీలక పాత్రని ఫరీదాబాద్ లోని సర్వోదయ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్ మెంట్ అసోసియేషన్ డైరెక్టర్ రీతు ఝా పేర్కొన్నారు.

Parkinsons Disease : పర్యావరణ మార్పులతో యువతను పట్టిపీడిస్తోన్న వణుకుడు వ్యాధి

Parkinsons Disease

Updated On : April 12, 2023 / 7:38 AM IST

Parkinsons Disease : సాధారణంగా వణుకుడు వ్యాధి(పార్కిన్సన్స్) వృద్ధుల్లో కనిపిస్తోంది. కానీ పర్యావరణ మార్పుల కారణంగా వణుకుడు వ్యాధి యువతను కూడా పట్టిపీడిస్తోందని డాక్టర్లు తెలిపారు. వణుకుడు వ్యాధి నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యగా చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడినవారి ఎల్లప్పుడూ వణకుతూ ఉంటుంది.

ఇప్పటివరకు వణుకుడు వ్యాధికి సరైన కారణాన్ని గుర్తించనప్పటికీ జన్యుపరమైన సంబంధ కారణాలదే
కీలక పాత్రని ఫరీదాబాద్ లోని సర్వోదయ హాస్పిటల్ న్యూరాలజీ డిపార్ట్ మెంట్ అసోసియేషన్ డైరెక్టర్ రీతు ఝా పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలి, పర్యావరణ మార్పుల వల్ల యువత కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Covid Parkinsons Disease : పార్కిన్సన్‌ను పసిగట్టే యాప్‌.. వాయిస్ తో వ్యాధి గుర్తింపు

వాయు కాలుష్యం, సూక్ష్మమైన నలుసు, కొన్ని రకాల పురుగు మందులు, క్రిమిసంహారకాల వల్ల కూడా ఈ వ్యాధి ముప్పు ఏర్పడుతుందన్నారు. దీంతో మెదడులో వాపు, ఒత్తిడి కలుగుతుందని వెల్లడించారు.