అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై.. పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన.. వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.

Air India Plane Crash

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు సమావేశాల్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు.

Also Raed: PM Modi: భారత బలగాల ప్రతాపాన్ని ప్రపంచం చూసింది.. పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కీలక సూచన

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రాథమిక నివేదిక వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నాం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఇంధన సరఫరా నిలిపివేయడం వల్ల ప్రమాదం జరిగినట్లు కనిపిస్తోంది. ప్రమాదంపై వివిధ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. తుది నివేదిక వచ్చాకే ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలుస్తాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు.


ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్విస్టిగేషన్‌ బ్యూరో పారదర్శకంగా దర్యాప్తు జరుపుతోంది. కానీ, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదు. విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపడుతారు. అంతర్జాతీయ ప్రోటోకాల్‌కు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Also Read: కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకలా అన్నాడు.. పహల్గామ్ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు.. ఖర్గే వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఏం చెప్పారంటే..?

విమానంలోని బ్లాక్ బాక్స్‌ల నుంచి డేటాను సేకరించాం. దానిపై దర్యాప్తు జరుగుతుంది. ప్రమాద సమయంలో విమానంలో ఏం జరిగిందనే విషయం తుది నివేదిక వచ్చిన తరువాత మాత్రమే తెలుస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. తుది దర్యాప్తు వచ్చే వరకు ప్రతిఒక్కరూ దర్యాప్తు ప్రక్రియను గౌరవించాలని కోరుతున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. లోక్ సభ, రాజ్యసభ ప్రారంభమైన నాటి నుంచి ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో పలుసార్లు సభలు వాయిదా పడ్డాయి.