PM Modi: భారత బలగాల ప్రతాపాన్ని ప్రపంచం చూసింది.. పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కీలక సూచన

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు.

PM Modi: భారత బలగాల ప్రతాపాన్ని ప్రపంచం చూసింది.. పార్లమెంట్ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ కీలక సూచన

PM Modi

Updated On : July 21, 2025 / 11:09 AM IST

 

PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వెలుపల మోదీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా వందశాతం లక్ష్యాలను ఛేదించామని, ఆ ఆపరేషన్ తో మన దేశ సైనికుల సత్తా చూశామని అన్నారు. 22 నిమిషాల్లోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేశామని, భారత బలగాల ప్రతాపం ప్రపంచం మొత్తం చూసిందని మోదీ అన్నారు.

రుతుపవనాలు ఆవిష్కరణ, పున:సృష్టికి చిహ్నం. దేశం కొత్త శక్తి, కొత్త ప్రేరణ, కొత్త విధానాలకు పురుడుపోసుకోవాల్సిన సమయం ఇది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. దేశంలో రుతుపవనాలు బాగా పురోగమిస్తున్నాయి. ఇది వ్యవసాయ రంగానికి, రైతులకు శుభసూచకం అని ప్రధాని మోదీ అన్నారు. రైతులు, గ్రాములు, ప్రతి కుటుంబం ఆర్థిక వ్యవస్థకు వర్షం చాలా ముఖ్యం. గత పది సంవత్సరాల కంటే ఈసారి మూడు రెట్లు ఎక్కువ నీటి నిల్వ ఉంది. ఇది రాబోయే కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుందని మోదీ చెప్పారు.

2014కి ముందు భారతదేశం ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని.. కానీ, నేడు భారతదేశం మూడో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని మోదీ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ద్రవ్యోల్బణం రేటు తగ్గిందని మోదీ చెప్పారు. మావోయిస్ట్ ముక్త్ భారత్‌లో ముందడుగు వేశామని, అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామని మోదీ అన్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, రోదసి యాత్రను ప్రశంసించారు. ఐఎస్ఎస్ లో జాతీయ జెండా ఎగురవేయడం దేశ ప్రజలకు గర్వకారణమని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

వర్షాకాల సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ సూచించారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రతి ఎంపీ, ప్రతీ పార్టీ ఈ సమావేశంలో దేశం సాధించిన విజయాలను కీర్తించడం ద్వారా ఇది దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని, ప్రపంచానికి భారతదేశ బలాన్ని తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ఆయుధాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయని మోదీ చెప్పారు.