Amit Shah Women Reservation Bill : కాంగ్రెస్ డిమాండ్ కి అంగీకరించిన అమిత్ షా..50 శాతానికి రెడీ అంటూ ప్రకటన
Amit Shah Women Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
parliament special session 2026 amit shah on delimitation and women reservation bill lok sabha
Amit Shah Women Reservation Bill : పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు రెండో రోజులో భాగంగా శుక్రవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలకు మేలు చేసేందుకే ఈ బిల్లులను తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుపై సభలో అందరూ తమ అభిప్రాయాలు చెప్పేందుకు స్పీకర్ ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారని తెలిపారు.
విపక్ష కూటమి అయిన ‘ఇండియా’ (INDIA) సభ్యులు మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెబుతూనే.. బిల్లును అడ్డుకోవడానికి రకరకాల కారణాలు వెతుకుతున్నారని అమిత్ షా ఆరోపించారు. విపక్షాలకు మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదని, వారిది మహిళా వ్యతిరేక ఆలోచనా విధానమని ఆయన మండిపడ్డారు.
అయితే అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వేర్వేరు చేయాలని ప్రతిపాదించారు. దీంతో పాటు గే ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతానికి తగ్గకుండా సీట్లు పెంచుతామని బిల్లులో పెట్టాలని డిమాండ్ చేశారు. వేణు గోపాల్ చేసిన ప్రతిపాదనల్లో రెండో దానికి అమిత్ షా అంగీకారం తెలిపారు.
అయితే అమిత్ షా వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. “మహిళను ప్రధాన మంత్రిని చేస్తామని బీజేపీ చెప్పినా మేం నమ్మం” అన్నారు. మహిళా రిజర్వేషన్లో ముస్లిం మహిళల వాటా ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి అమిత్ షా బదులిస్తూ.. తాము మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
