IndiGo flight : ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం…ప్రయాణికుల కలకలం

ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి దుశ్చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళుతున్న ఓ ప్రయాణికుడు ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించడంతో సహ ప్రయాణికుల్లో కలకలం రేగింది....

IndiGo flight : ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం…ప్రయాణికుల కలకలం

IndiGo flight

Updated On : September 20, 2023 / 9:15 AM IST

IndiGo flight : ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి దుశ్చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళుతున్న ఓ ప్రయాణికుడు ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించడంతో సహ ప్రయాణికుల్లో కలకలం రేగింది.  (Delhi to Chennai IndiGo flight) మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం 6ఈ 6341లో ఈ ఘటన జరిగింది.

Azerbaijan : అజర్‌బైజాన్‌లో సైనికుల దాడి, 25మంది మృతి

మణికందన్‌గా గుర్తించిన ప్రయాణికుడిని విమానం చెన్నై విమానాశ్రయానికి చేరుకోగానే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. ( IndiGo flight attempts to open emergency door) ఇండిగో అధికారులు ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎయిర్‌లైన్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ban Hookah Bars : కర్ణాటకలో హుక్కా బార్‌లపై త్వరలో నిషేధం

చెన్నై విమానాశ్రయంలో దిగగానే ఎయిర్‌లైన్ అధికారులు సీఐఎస్‌ఎఫ్ అధికారులకు ఘటన గురించి వివరించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మణికందన్ అనే ప్రయాణీకుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించారని గుర్తించారు. వికృతమైన ప్రయాణీకుడి చర్యపై తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.