బిలియనీర్ బాబా : ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో పతంజలి

బిలియనీర్ బాబా : ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో పతంజలి

Updated On : March 6, 2019 / 12:14 PM IST

బాబాల ప్రభావం ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్‌లోనే ఎక్కువగా ఉందంటే నమ్మని వాళ్లకు ఇదొక సమాధానం. పతంజలి ఉత్పత్తుల ద్వారా విపరీతంగా సంపాదించిన బాబా బాలకృష్ణ గురించి వింటే ఎవరైనా అవునని అనాల్సిందే. 2018లో ఆయన సంపాదించిన దానిని బట్టి ఫోర్బ్స్ జాబితాలో భారత్‌ సంపాదనాపరులలో 15వ వాడిగా నిలిచాడు. బాబా రామ్‌దేవ్‌తో కలిసి స్థాపించిన ఈ పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ 98.6 శాతం వరకూ వాటాలు బాబా బాలకృష్ణ పేరు మీదనే ఉన్నాయి. 

పతంజలి ఉత్పత్తులు సంవత్సరానికి 1.6 బిలియన్ డాలర్ల ఆధాయాన్ని తెచ్చిపెడుతున్నాయంట. అంటే అక్షరాల రూ. 160కోట్లన్న మాట. ఈ మధ్యనే మార్కెట్‌ పెంచుకునేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకున్న పతంజలి మున్ముందు ఇంకా దూసుకుపోవడం ఖాయమని చెప్తున్నారు విశ్లేషకులు. 

ఈ జాబితాలో ఉన్న భారతీయులలో టాప్ ప్లేస్‌లో ముఖేశ్ అంబానీ  ఉండగా 22.6 బిలియన్ డాలర్లతో విప్రో సంస్థకు చెందిన అజీమ్ ప్రేమ్ జీ నిలిచారు. అంతేకాకుండా ప్రేమ్ జీ ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులలో 36వ వాడిగా స్థానం దక్కించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనికులలో ముఖేశ్ అంబానీ ఒక్కరే టాప్ 20 బిలియనీర్స్‌లో ఒకరిగా నిలిచారు.