Uttar Pradesh : బ్రతికుండగానే సమాధి నిర్మించుకుని పిండ ప్రదానం నిర్వహించుకున్న వ్యక్తి

కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఒంటరిగా పొలంలో నివాసం ఉంటున్నాడు. తను చనిపోతే అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రదానం కూడా చేయరనుకున్నాడేమో.. ఓ పెద్దాయన బ్రతికుండగానే ఆ కార్యక్రమాలు తనకు తానే నిర్వహించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Uttar Pradesh : బ్రతికుండగానే సమాధి నిర్మించుకుని పిండ ప్రదానం నిర్వహించుకున్న వ్యక్తి

Uttar Pradesh

Updated On : June 20, 2023 / 12:09 PM IST

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఓ వృద్ధుడు తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. అంతకి సంస్కారాలు నిర్వహించుకున్నాడు.  గ్రామస్తులకు విందు కూడా ఏర్పాటు చేశాడు. ఈ విచిత్రమైన ఘటనకు వెనుక కారణం ఉంది.

Kedarnath Dham: కేదార్‌నాథ్‌ ఆలయం గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్.. మహిళపై కేసు నమోదు

ఉత్తప్రదేశ్‌లోని కేవాన్ గ్రామానికి చెందిన జటా శంకర్ అనే వృద్ధుడు బ్రతికుండగానే అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేశాడు. జటా శంకర్‌కు కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయట. దాంతో అతను మరణించిన తరువాత వారు అంత్యక్రియలు చేస్తారో? లేదో ఖచ్చితంగా తెలియక జటా శంకర్ తను బ్రతికుండగానే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.

 

జటా శంకర్ తన సమాధి కోసం ఒక కాంక్రీట్ ప్లాట్ ఫామ్ కూడా నిర్మించాడు. జూన్ 15 నాటికి అతను మరణించి 13వ రోజుగా నిర్ణయించి తనకు తానే పిండ ప్రదానం చేసుకున్నాడు. గ్రామస్తులకు విందు ఏర్పాట్లు కూడా చేశాడు. కొంతకాలంగా జటా శంకర్ తన పొలంలో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అతని కుటుంబం అతనిని కలవడానికి అప్పుడప్పుడు వచ్చేదట. తాను ఎప్పుడు చనిపోయిన దయచేసి ఇక్కడే తన అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా జటా శంకర్ గ్రామస్తులను కోరినట్లు తెలుస్తోంది.

Rajasthan: ముఖ్యమంత్రి పుట్టిన రోజు కోసం వేసిన హోర్డింగ్ ఎత్తుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‭లో వింత ఘటన

ఇక జటా శంకర్ సజీవంగా ఉన్నప్పుడే మరణించిన తరువాత చేయవలసిన అంతిమ సంస్కారాలు నిర్వహించడం గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.