పెంపుడు కుక్క చనిపోయిందని..యువతి ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 01:10 AM IST
పెంపుడు కుక్క చనిపోయిందని..యువతి ఆత్మహత్య

Updated On : November 20, 2020 / 7:17 AM IST

pet dog’s death, Chhattisgarh woman kills self : జంతువులంటే..కొంతమందికి యమ ప్రేమ. వాటికి ఏమైనా అయ్యిందంటే తట్టుకోలేకపోతారు. అవి కనిపించకపోతే..కంప్లైట్స్ కూడా ఇస్తుంటారు. అయితే..తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన చత్తీస్ గడ్ లోని రాయ్ గడ్ జిల్లాలో చోటు చేసుకుంది.



కోట్రా రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో గోర్ఖా ప్రాంతంలో కుటుంబంతో Priyanshu Singh అనే యువతి నివాసం ఉంటోంది. ఈమె…పోస్టు గ్రాడ్యుయేట్. నాలుగేళ్ల పెంపుడు కుక్కను పెంచుకొంటోంది. అయితే..అనారోగ్యం కారణంగా..కుక్క చనిపోయింది. కుక్క లేకపోవడం ప్రియాంషు జీర్ణించుకోలేకపోయిందని Chaman Sinha, station house officer (SHO వెల్లడించారు. కుక్క అంత్యక్రియలు పూర్తి చేశాక.. మరుసటి రోజు ఇంట్లోని ఐరన్ పైప్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.



ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ప్రియాంషు రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్ డాగ్ ను పాతి పెట్టిన చోటే తన అంత్యక్రియలు కూడా నిర్వహించాలని ఆ లేఖలో వెల్లడించిందని Chaman Sinha వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.