Phones, TVs Banned: ఆ ఊర్లో రాత్రి సమయంలో గంటన్నర పాటు టీవీ, ఫోన్లు పనిచేయవు.. అసలు విషయం తెలిస్తే వావ్ అనాల్సిందే..
రాత్రి 7గంటలకు ఆ గ్రామంలో సైరన్ మోగుతుంది. వెంటనే ప్రతీ ఇంట్లో టీవీలు, ఫోన్‌లు బంద్ అవుతాయి. పిల్లలు పుస్తకాలు పడతారు, మహిళలు వంటలు, ఇతర పనుల్లో నిమగ్నమవుతారు. ఆగస్టు 15 నుంచి ప్రతీరోజు గంటన్నర పాటు ఇదే పద్దతి. దీంతో ఆ ఊరిపేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోతుంది.

Phones, TVs Banned
Phones, TVs Banned: పిల్లల నుంచి పెద్దల వరకు పడుకొనే సమయం తప్పించితే మిగతా సమయాల్లో ఫోన్ పక్కన లేనిదే ఉండలేని పరిస్థితి. ముఖ్యంగా గతేడాది క్రితం కరోనా సమయంలో ఫోన్లు, టీవీల వినియోగం మరీ ఎక్కువ అయింది. రాత్రి అయిందంటే చాలు ఫోన్లతో పిల్లలు, సీరియల్స్‌తో మహిళలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ అలవాటుకు చెక్ పెట్టేందుకు ఓ గ్రామ సర్పంచ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాత్రి సమయంలో 7 గంటల నుంచి 8:30 గంటల వరకు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు టీవీలు, ఫోన్లను వినియోగించొద్దని సర్పంచ్ ఆదేశాలు జారీ చేశాడు.
మహారాష్ట్ర సంగ్లీ జిల్లా కాడేగావ్ మండలం మోహిత్యాంచె వడ్గావ్ గ్రామంలో రాత్రి 7గంటల నుంచి 8.30 గంటల మధ్యలో టీవీలు, సెల్ ఫోన్లు పనిచేయవు. ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే తీసుకున్న నిర్ణయంతో ఆ గ్రామం పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. గ్రామంలో మొత్తం జనాభా 3,105 మంది ఉంటారు. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు తల్లిదండ్రులు విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చారు. అప్పటినుంచి పిల్లలంతా గంటల తరబడి మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారి బడినుంచి వచ్చాక కనీసం పుస్తకాలు కూడా తీయడం లేదు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మరోవైపు మహిళలు సాయంత్రం సమయంలో టీవీ సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు. ఫలితంగా పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలో రాత్రి 7గంటలనుంచి 8.30 గంటల వరకు ఎవరూ టీవీలు చూడొద్దు, ఫోన్లు వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేశాడు. తొలుత వీటిని పక్కన పెట్టేందుకు గ్రామస్తులు ఇబ్బంది పడినప్పటికీ.. ఆగస్టు 15 నుంచి ఆ ఊరిలో రాత్రి వేళ సైరన్ మోగగానే ఆ గంటన్నర పాటు టీవీలు, సెల్ ఫోన్లు మూగబోతున్నాయి. దీంతో పిల్లలు ఆ సమయంలో పుస్తకాలు తీసి చదువుతుండగా, మహిళలు వంటలపై దృష్టిపెడుతున్నారు. గ్రామంలో ప్రజలు నిబంధనలు అతిక్రమించకుండా పంచాయతీ సభ్యులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షణ చేస్తున్నారు.