కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బీజేపీ ప్రాణాలతో ఆడుకుంటుంది: కమల్‌హాసన్

కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బీజేపీ ప్రాణాలతో ఆడుకుంటుంది: కమల్‌హాసన్

Updated On : October 24, 2020 / 11:00 AM IST

యాక్టర్-పొలిటీషియన్ Kamal Haasan బీజేపీని తిట్టిపోశారు. ఏఐఏడీఎమ్కేతో ఒప్పందం కుదుర్చుకుని ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని వాగ్దానం చేసింది. వచ్చే వారం జరగబోయే బీహార్ ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోలో ఇది పొందుపరిచింది. ఏఐడీఎంకే ఒప్పందం కుదుర్చుకున్న మరుసటి రోజే కమల్ వారిపై విమర్శలు ఎక్కుపెట్టాడు. రెడీ అవని వ్యాక్సిన్ గురించి అభూత కల్పనలు క్రియేట్ చేసి ఫేక్ ప్రామిస్ లు చేస్తున్నారని కమల్ హాసన్ అన్నారు.

‘వ్యాక్సిన్ అనేది లైఫ్ సేవింగ్ డ్రగ్, అదేదో మాట ఇచ్చి తప్పేసేది కాదు. ప్రజల పేదరికంతో ఆడుకుంటున్నారు. అయినా మీరు వారి ప్రాణాలతో ఆడుకోవాలనుకుంటే. ప్రజలే మీ రాజకీయ జీవితాన్ని డిసైడ్ చేస్తారు’ అని మక్కల్ నీధి మయ్యమ్ చీఫ్ శుక్రవారం సాయంత్రం మాట్లాడుతూ అన్నారు. సీఎం పళనిస్వామి.. మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ ఒకసారి రెడీ అయితే.. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగానే అందిస్తాం’ అని అన్నారు.



గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. మా మ్యానిఫెస్టోలో పొందుపరిచిన మొదటి అంశం ఇదే. బీహార్ లో ప్రతి ఒక్కరూ ఉచితంగా కరోనావైరస్ వ్యాక్సిన్ అందుకుంటారు. ఈ వాగ్దానం గురించి తెలిసి ప్రతిపక్షం షాక్ అవ్వడంతో పాటు.. బీజేపీపై పలు ఆరోపణలు, విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా.. తీవ్ర అనారోగ్యానికి గురై ఇండియాలో దాదాపు ఓ లక్షమందికి పైగా చనిపోయేలా చేసింది.
https://10tv.in/free-covid-19-vaccine-for-all-once-it-is-ready-tamil-nadu-cm/
ఈ అంశంపై ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పతిస్తూ.. బీజేపీ మధ్యప్రదేశ్ ని కూడా తిట్టిపోశారు. అక్కడ కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామంటూ అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారు. మీ రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి.. అప్పటికల్లా వ్యాక్సిన్ రెడీ అవుతుందని చెప్పగలరా.. అని ప్రశ్నించారు రాహుల్. ప్రతిపక్షాలన్నీ బీజేపీ.. ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశాయి.