పైసా వసూల్: ప్లాట్ ఫాం టికెట్ రూ.20

పైసా వసూల్: ప్లాట్ ఫాం టికెట్ రూ.20

Updated On : January 8, 2020 / 11:59 PM IST

సంక్రాంతి పండుగకు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులే కాదు.. రైల్వే వ్యవస్థ కూడా బాగా వాడుకుంటుంది. ఈ మేరకు ప్లాట్‌ఫాం టికెట్ రేట్లను 100 శాతం పెంచుతూ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20కి పెంచతున్నట్లు ప్రకటించింది.

ధరల పెంపు జవనరి 9 నుంచి 19 రోజుల పాటు అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటన ద్వారా తెలిపింది. గతేడాది వారం రోజులు, అంతకంటే ముందు 4రోజుల పాటు ఈ రేట్లను వర్తింపజేసిన అధికారులు ఈసారి 11 రోజులకు పెంచడం గమనార్హం.పండుగలకు వెళ్లే వారిని సెండాఫ్ ఇవ్వడానికి, వచ్చే వారిని రిసీవ్ చేసుకోవడానికి ప్లాట్ ఫాంలపైకి వచ్చే వాళ్ల నుంచి దండుకోవాలని ఆర్టీసీ ఆలోచన.

దక్షిణ మధ్య రైల్వే మూడేళ్లుగా దసరా, సంక్రాంతి పండుగ సమయాల్లో ప్లాట్‌ఫాం టికెట్ రేట్లను పెంచుతోంది. కొంత మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైల్వే అధికారులకు ఝులక్ ఇస్తున్నారు. ఎంఎంటీఎస్ టిక్కెట్టు ధర కనిష్టంగా రూ.5 ఉంది. ఈ టిక్కెట్‌తో రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించి.. గంటల తరబడి గడుపుతూ టీసీల నుంచి తప్పించుకుంటున్నారు. 

ఇలా రూ.5 ఎంఎంటీఎస్ టిక్కెట్‌తో రెండు విధాలా లబ్ధి పొందొచ్చు. బంధువులకు వీడ్కోలు పలకడమే కాకుండా.. ఉచిత వైఫై సేవలను కూడా అనుభవిస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వే నెలకు సుమారు 15 లక్షల ప్లాట్‌ఫాం టికెట్లను విక్రయిస్తోంది. వీటి ద్వారా రూ.1.5 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతోంది.