PM-CARES : కోవిడ్ తో చనిపోయిన పేరెంట్స్ పిల్లలకు కేంద్రం అండ..ఉచిత విద్య, రూ. 10 లక్షలు
కోవిడ్ - 19తో తల్లిదండ్రులు, లేదా వారిని సంరక్షించే వారు చనిపోయి..అనాథలుగా మారిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది.

Pm Care India
Who Lost Parents To Covid : భారతదేశంలో కరోనా కుటుంబాలను విచ్చిన్నం చేసింది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తల్లిని కోల్పోయి ఒకరు, తండ్రిని కోల్పోయిన వారు మరొకరు..తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారు ఇంకొందరు…ఇలా ఎన్నో దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనాథలుగా మారిన పిల్లల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి. వారి మేలు కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
కోవిడ్ – 19తో తల్లిదండ్రులు, లేదా వారిని సంరక్షించే వారు చనిపోయి..అనాథలుగా మారిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. పిల్లల ఉన్నత విద్యకు విద్య రుణాలు అందిస్తామని, దీని వడ్డీ పీఎం కేర్స్ ఫండ్ చెల్లిస్తుందని వెల్లడించింది. 18 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటే…వారికి నెలనెలా స్టైఫండ్ అందించడం జరుగుతుందని తెలిపింది. 29 సంవత్సరాలు వచ్చాక..పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ. 10 లక్షలు ఇస్తామని వెల్లడించింది.
కరోనా వైరస్ బారిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయిన మరణించిన పిల్లల వివరాలను ఆన్ లైన్ ట్రాకింగ్ పోర్టల్ బాల్ స్వరాజ్ లో నమోదు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బాలల హక్కుల జాతీయ కమిషన్ సూచించింది.
Read More : Rape On Student: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. హత్య