Heeraben Modi: తల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ(100)ని చూసేందుకు అహ్మదాబాద్ వెళ్లారు. ఇవాళ ఉదయం హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్ కు తరలించిన విషయం తెలిసిందే. ఆ ఆస్పత్రి వద్దకు మోదీ కాన్వాయ్ చేరుకున్న దృశ్యాలను పలు జాతీయ మీడియా ఛానెళ్లు పోస్ట్ చేశాయి.

Heeraben Modi: తల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోదీ

Updated On : December 28, 2022 / 4:32 PM IST

Heeraben Modi: ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ(100)ని చూసేందుకు అహ్మదాబాద్ వెళ్లారు. ఇవాళ ఉదయం హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్ కు తరలించిన విషయం తెలిసిందే. ఆ ఆస్పత్రి వద్దకు మోదీ కాన్వాయ్ చేరుకున్న దృశ్యాలను పలు జాతీయ మీడియా ఛానెళ్లు పోస్ట్ చేశాయి.

ఆసుపత్రిలో తన తల్లిని చూసిన మోదీ అనంతరం వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. తల్లితో మాట్లాడిన అనంతరం మోదీ మళ్ళీ ఢిల్లీకి వెళ్తారా? లేదా అక్కడే ఉంటారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇటీవలే నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు కారు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో వారికి కూడా ఆసుపత్రిలో చికిత్స అందింది.

యూఎన్ మెహతా ఆస్పత్రిలో హీరాబెన్ మోదీతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. హీరాబెన్ మోదీ ఆరోగ్యం నిలకడగానే ఉందని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ కి పలువురు బీజేపీ నేతలు కూడా వస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, మోదీ తల్లి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు

.

Modi-Jagan: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. నేటి సాయంత్రం అమిత్ షాతోనూ సమావేశం