బంధాలు, అనుబంధాలు లేవు…అందుకే అమ్మతో ఉండటం లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : April 24, 2019 / 05:36 AM IST
బంధాలు, అనుబంధాలు లేవు…అందుకే అమ్మతో ఉండటం లేదు

Updated On : April 24, 2019 / 5:36 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్ లోని అధికార నివాసంలో ఎందుకు తన కుటుంబసభ్యులతో కలిసి ఉంటడం లేదో తెలుసుకోవాలని చాలా మందికి ఆశక్తి ఖచ్చితంగా ఉంటుంది.తన తల్లి,ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఎందుకు ఉంటున్నాడో,ఎలా ఉంటున్నాడో స్వయంగా మోడీనే చెప్పారు. మంగళవారం (ఏప్రిల్-23,2019) తన అధికారిక నివాసంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూ సందర్భంగా మోడీ తన మనసులోని మాటలను బయటపెట్టారు.

ఎందుకు మీరు ఇంట్లో మీ అమ్మ,బంధువులను ఉంచుకోలేదు అని అక్షయ్ మోడీని అడిగారు.మోడీ మాట్లాడుతూ….నేను చిన్నతనంలోనే ఇంటికి దూరంగా వెళ్లాను.ప్రధాని అయిన తర్వాత కొత్తగా ఏమీ వాళ్లతో కలిసి ఉండకుండా ఉన్నది కాదు.చిన్నతనంలోనే ఫ్యామిలీని వదిలివెళ్లిన నేను ప్రేమ,అనురాగాలు,ఆప్యాయతలు వంటివాటికి దూరంగా పెరిగాను. పైగా నేను ఇంటికి వెళ్లినప్పుడుల్లా మా అమ్మ ఎందుకు ఇక్కడే ఉన్నావు…వెళ్లి ఏదో ఒక పని చేసుకో అని చెప్పేది.
Also Read : ఆ మాటకు నవ్వు ఆపుకోలేకపోయిన మోడీ,అక్షయ్

నేను మా అమ్మను నాతో పాటు ఇంట్లో ఉంచుకుంటే…నాకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆమెతో ఎక్కువ సమయం గడపలేను.అమ్మతో కలిసి భోజనం చేసేందుకు సమయముండదు.దీంతో అమ్మ నా కొడుకు నాతో సమయం గడపటం లేదని బాధపడుతుంది.నా గురించే ఆలోచిస్తూ దిగులు పెట్టుకుంటుంది.అందుకే అమ్మను నా దగ్గర ఉంచుకోవడం లేదు అని మోడీ అన్నారు.అంతేకాకుండా ఇప్పటికి కూడా అమ్మ తనకు డబ్బులు పంపిస్తుందని మోడీ చెప్పారు.మీరు మీ అమ్మకి డబ్బులు పంపిస్తారా అని అక్షయ్ అడిగినప్పుడు సమాధానంగా…ఆమె నాకు ఇంటికెళ్లినప్పుడల్లా డబ్బులు ఇస్తుందని మోడీ అన్నారు.

గతంలో ప్రసంగాల్లో కాస్త హాస్యం జోడించేవాడినని,కానీ ఈరోజుల్లో అలా చేయడం లేదు టీఆర్పీ కోసం కొన్ని మీడియా సంస్థలు నా వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం చేస్తారన్న భయం కారణంగానే  నా ప్రసంగాల్లో హాస్యం జోడించడంలేదు అని మోడీ అన్నారు.తాను రాజకీయాల్లోకి వస్తాను, ప్రధాని అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనుకున్నట్లు తెలిపారు.తానెప్పుడూ కోపగించుకోనని కానీ  కోపాన్ని బయటికి చూపించే అవకాశం ఎప్పుడూ రాలేదన్నారు. తాను ఎప్పుడూ నిర్మాణాత్మకమైన విమర్శలను నమ్ముతానన్నారు.బీజేపీలోనే కాకుండా అన్ని పార్టీల్లో తనకు స్నేహితులు ఉన్నారని మోడీ అన్నారు.వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ లతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందన్నారు.ప్రతి ఏటా మమత తనకు స్వీట్లు కుర్తాలు పంపిస్తుందన్నారు.
Also Read : ఆజాద్ ఆప్తమిత్రుడు : మమత కుర్తాలు పంపిస్తారు : అక్షయ్ తో మోడీ చిట్ చాట్

రోజులో మారు నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోతారు కానీ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు ఎలా అని అడుగగా…అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాను కలిసినప్పుడుల్లా మీరు ఇప్పటికీ అలాగే ఉన్నారా అని తనను ఒబామా సరదాగా అడుగుతుంటాడని మోడీ అన్నారు.