PM Modi : 75 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల తాళాలు అందజేసిన మోదీ

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా గాంధీ ప్ర‌తిష్టాన్‌లో ఏర్పాటుచేసిన "ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా

PM Modi : 75 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల తాళాలు అందజేసిన మోదీ

Modi (2)

Updated On : October 5, 2021 / 4:14 PM IST

PM Modi ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరా గాంధీ ప్ర‌తిష్టాన్‌లో ఏర్పాటుచేసిన “ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా(ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బ‌న్ ల్యాండ్‌స్కేప్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్‌పో)”కార్యక్రమాన్ని ఇవాళ(అక్టోబర్-5,2021)ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురి, యూపీ గ‌వ‌ర్న‌ర్ ఆనందిబెన్ ప‌టేల్‌, యూపీ సీం యోగి ఆదిత్య‌నాథ్‌లు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. కాగా, వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న యూపీలో ఇటీవల కాలంలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది మూడోసారి.

ఈ సందర్భంగా  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నిర్మించిన ఇళ్ల యొక్క తాళాలను అబ్దిదారులకు మోదీ అందించారు.  75 వేల మంది ల‌బ్ధిదారుల‌కు డిజిట‌ల్ రూపంలో ఇంటి తాళాల‌ను అందించారు. ఆ తర్వాత లబ్దిదారులతో మోదీ మాట్లాడారు. ఉత్తర్​ప్రదేశ్​లో గత ప్రభుత్వాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మోదీ మాట్లాడుతూ.. 2017కు ముందు యూపీలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.18వేల కోట్లు మంజూరయ్యాయి. కానీ 18 ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్​ 9 లక్షల ఇళ్లను నిర్మించింది. మరో 14 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్​డీఏ ప్రభుత్వం 3 కోట్ల మంది పేదలను లక్షాధికారులుగా మార్చిందని అన్నారు.

కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ పూరి మాట్లాడుతూ…ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద కేంద్రం 17.3 ల‌క్ష‌ల ఇండ్ల‌ను మంజూరు చేయగా… ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 8.8 ల‌క్షల మంది ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల తాళాలను అంద‌జేసిన‌ట్లు తెలిపారు.

ల‌క్నోలో అర్బ‌న్ స‌ద‌స్సును నిర్వ‌హించ‌డం ఈ న‌గ‌రానికి వ‌న్నె తెచ్చిన‌ట్లు అవుతుంద‌ని మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఇండియాను కొత్త‌గా చూడాల‌న్న క‌ల ప్ర‌ధానికి ఉంద‌ని, దాని కోసం ఆయ‌న నిరంత‌రంగా శ్ర‌మిస్తున్నార‌ని, భార‌త్ కూడా ఆయ‌న ఆశించిన మార్పును గ‌మ‌నిస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఇక, యూపీ పర్యటనలో భాగంగా అయోద్య అభివృద్ధి మాస్టర్​ప్లాన్ గురించి కూడా మోదీ ఆరా తీశారు.

ఆజాదీ@75 ఏంటీ
‘ఆజాది కా అమృత్ మహోత్సవం’లో భాగంగా అక్టోబర్ 5 నుండి 7 వరకు హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) ద్వారా కాన్ఫరెన్స్-కమ్-ఎక్స్‌పో నిర్వహించబుడుతోంది. ప్రత్యేక దృష్టితో ఉత్తరప్రదేశ్ లో తీసుకొచ్చిన పరివర్తన మార్పులపై ట్రాన్స్‌ఫార్మింగింగ్ ది అర్బ‌న్ ల్యాండ్‌స్కేప్ థీమ్ తో కాన్ఫరెన్స్-కమ్-ఎక్స్‌పో ని నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కాన్ఫరెన్స్-కమ్-ఎక్స్‌పోలో పాల్గొంటాయి. ఇది భవిష్యత్ లో చేపట్టే చర్యల కోసం… అనుభవ భాగస్వామ్యం, నిబద్ధత మరియు డైరక్షన్ లో సహాయపడుతుంది.

కాన్ఫరెన్స్-కమ్-ఎక్స్‌పోలో మూడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశారు.
1. “న్యూ అర్బన్ ఇండియా’ అనే పేరుతో ఏర్పాటైన ఎగ్జిబిషన్..అర్బన్ మిషన్స్ యొక్క విజయాలు మరియు భవిష్యత్తు అంచనాలను ప్రదర్శిస్తుంది. ఇది గత ఏడు సంవత్సరాలలో ప్రధాన అర్బన్ మిషన్స్ కింద సాధించిన విజయాలు మరియు భవిష్యత్తు అంచనాలను హైలైట్ చేస్తుంది.
2. గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్-ఇండియా (GHTC-India) కింద “ఇండియన్ హౌసింగ్ టెక్నాలజీ మేళా(IHTM)” పేరుతో 75 వినూత్న నిర్మాణ టెక్నాలజీలపై ఎగ్జిబిషన్. దేశీయంగా అభివృద్ధి చెందిన స్వదేశీ మరియు వినూత్న నిర్మాణ సాంకేతికతలు, మెటీరియల్స్ మరియు ప్రక్రియలను ప్రదర్శిస్తారు.
3. UP@75: ఉత్తర ప్రదేశ్‌లో పట్టణ ప్రకృతి దృశ్యాన్ని మార్చడం అనే థీమ్ తో… అర్బన్ మిషన్‌లు మరియు భవిష్యత్తు అంచనాల కింద 2017 తరువాత ఉత్తర ప్రదేశ్ పనితీరును ప్రదర్శించడానికి ఎగ్జిబిషన్.

కాగా,ఎగ్జిబిట్స్ యొక్క నినాదాలు… స్వచ్ఛమైన పట్టణ భారత్, నీటి భద్రత నగరాలు, అందరికీ ఇళ్లు, కొత్త నిర్మాణ సాంకేతిక, స్మార్ట్ సిటీ అభివృద్ధి,సుస్థిరమైన విద్యుత్ మరియు జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించే నగరాలు.

ALSO READ  ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!