వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. హాజరైన రాజకీయ ప్రముఖులు
లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు పుష్య నక్షత్ర సమయంలో ..

PM modi
PM Modi Varanasi Nomination : లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు గంగా సప్తమి సందర్భంగా దశాశ్వమేధ ఘాట్ లో గంగా నదికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన మోదీ.. కాలబైరవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు.
వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి మోదీ 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడోసారి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. మోదీపై యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. జూన్ 1న ఏడో విడతలో భాగంగా వారణాసి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.
Also Read : Pm Modi : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి- ప్రధాని మోదీ
నామినేషన్ కార్యక్రమం అనంతరం భారీర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఎల్‌జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్‌భర్ సహా ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పాల్గోనున్నారు. వీరిలో ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. అదేవిధంగా బీజేపీ, ఎన్డీఏ ముఖ్యమంత్రులు యోగి ఆధిత్యనాథ్, నితీష్ కుమార్, పుష్కర్ సింగ్ ధామి, మోహన్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, ఏకనాథ్ షిండే, భజన్ లాల్ శర్మ, హిమంత బిస్వ శర్మ, నయాబ్ సింగ్ సైనీ, ప్రమోద్ సావంత్, ప్రేమ్ సింగ్ తమాంగ్, మాణిక్ సాహా పాల్గోనున్నారు.