Festival Wishes: అక్షయ తృతీయ, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని

పండుగల సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

Festival Wishes: అక్షయ తృతీయ, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని

Modhi

Updated On : May 3, 2022 / 9:55 AM IST

Festival Wishes: దేశ వ్యాప్తంగా మంగళవారం అక్షయ తృతీయ, రంజాన్ పండుగలు పురస్కరించుకుని ప్రజలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు..ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదుల వద్ద నమాజ్ అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక పండుగల సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. “దేశప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్!. పవిత్ర రంజాన్ మాసం తర్వాత జరుపుకునే ఈ పండుగ సమాజంలో సోదరభావం సామరస్యాన్ని బలోపేతం చేయడానికి ఒక పవిత్ర సందర్భం. మనమందరం మానవాళికి సేవ చేస్తామని, పేదల జీవితాలను మెరుగుపరుస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

Also Read:Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి..

“రంజాన్ సందర్భంగా మన సమాజంలో ఐక్యత , సోదర భావాన్ని పెంపొందించాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. “రంజాన్ పండగ ఔదార్య స్ఫూర్తిని బలపరుస్తుంది. ప్రజలు ఒకరికొకరు స్నేహం, సోదరభావం, ప్రేమ, పరస్పర గౌరవంతో మెలగాలని ఆశిస్తున్నాను” అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

Also Read:Simhachalam Temple: అప్పన్న నిజరూప దర్శనాలు ప్రారంభం: తరలివచ్చిన ఏపీ మంత్రులు

ఇక “బసవ జయంతి” సందర్భంగా, పరశురామ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “పవిత్ర బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి నివాళులు. అతని ఆలోచనలు మరియు ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు శక్తిని ఇస్తూనే ఉన్నాయి.” అని ప్రధాని మోదీ కన్నడలో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జగద్గురు బసవేశ్వరుని గురించి 2020లో మోదీ మాట్లాడిన ప్రసంగాన్ని పంచుకున్నారు.