APJ Abdul Kalam : మిసైల్ మ్యాన్ కు మోదీ నివాళి

మిసైల్ మ్యాన్ గా పేరుపొందిన మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 90వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

APJ Abdul Kalam : మిసైల్ మ్యాన్ కు మోదీ నివాళి

Modi (3)

Updated On : October 15, 2021 / 3:54 PM IST

APJ Abdul Kalam మిసైల్ మ్యాన్ గా పేరుపొందిన మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 90వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశాన్ని బలమైన, సంపన్నమైన, సమర్థవంతమైనదిగా చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అబ్దుల్‌ కలాం అని ఇవాళ ఓ ట్వీట్ లో మోదీ గుర్తుచేసుకున్నారు.

దేశ ప్రజలకు అబ్దుల్‌కలాం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రధాని మోదీ తెలిపారు. గతంలో అబ్దుల్ కలాంతో కలిసి తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన రెండు ఫొటోలను మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు.

ALSO READ  రాబోయే ఎన్నికల్లో మోదీని నమ్ముకుంటే కష్టమే..కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు