డైరక్ట్ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి..దేశ ప్రజలను కోరిన ప్రధాని మోడీ

మోడీ ప్రభుత్వానికి మీరెన్ని మార్కులు ఇస్తారు. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మీ ఒపీనియన్ ఏంటీ అంటూ ఎవరైనా మాట్లాడుతుంటే వారు కచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారేమోనని మనం అనుకొంటాం. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం తిరిగి చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాల ఊహలకు సైతం అందకుండా తన వ్యూహాలతో ప్రతిపక్షాలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న ప్రధాని మోడీ తన ప్రభుత్వ పని తీరుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. నమో యాప్ లోని సర్వే ద్వారా నేరుగా దేశ ప్రజలు ప్రభుత్వ పని తీరుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని మోడీ కోరారు.
కీలక నిర్ణయాలు తీసుకోవడానికి తమకు ఈ ఫీడ్ బ్యాక్ అవసరమవుతుందని మోడీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని ఓ మీడియో మెసేజ్ ద్వారా మోడీ తెలిపారు. ఈ వీడియో మెసేజ్ ను ట్విట్టర్ ,ఫేస్ బుక్ లో ఆయన పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ సర్వే అంశాల్లో.. మహాకూటమి గురించి మీరేమనుకుంటున్నారు, మీ ప్రాంతాల్లో మహాకూటమి విజయవంతం అయ్యే అవకాయుందా అని ప్రశ్న కూడా ఉంది. అంతేకాకుండా అభ్యర్థుల ఎంపికలో కూడా ఈ సర్వే కీలకం కానుంది. గతేడాది మే నెలలో కూడా ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తి చేసుకునన సందర్భంగా నమో యాప్ ద్వారా ఇలాంటి సర్వేనే మోడీ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే.