Viral Video: అంబులెన్స్‭కు దారి ఇచ్చేందుకు రోడ్డు పక్కకెళ్లిన మోదీ కాన్వాయ్

భారతీయ జనతా పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. వీఐపీ కల్చర్ మోదీకి లేదని, ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటారని, మోదీ సింప్లిసిటీకి ఇదే నిదర్శనమని, ప్రజల అవసరాలను గుర్తించడంలో మోదీ ఎప్పుడూ ముందుంటారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: అంబులెన్స్‭కు దారి ఇచ్చేందుకు రోడ్డు పక్కకెళ్లిన మోదీ కాన్వాయ్

PM Modi Stops His Convoy, Gives Way To An Ambulance In Gujarat

Updated On : September 30, 2022 / 5:38 PM IST

Viral Video: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. తాను వెళ్తోన్న దారిలో ఒక అంబులెన్స్ వచ్చింది. అయితే ఆ అంబులెన్స్ వెళ్లడానికి దారినిస్తూ మోదీ కాన్వాయ్ రోడ్డుకు పక్కన ఆగింది. అహ్మదాబాద్ నుంచి రాజధాని గాంధీ నగర్‭కు వెళ్లే దారిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుందీ ఘటన. కాగా, మోదీ కాన్వాయ్‭లోని ఒకరు ఈ తంతగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోండంతో వైరల్‭గా మారింది.

భారతీయ జనతా పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. వీఐపీ కల్చర్ మోదీకి లేదని, ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటారని, మోదీ సింప్లిసిటీకి ఇదే నిదర్శనమని, ప్రజల అవసరాలను గుర్తించడంలో మోదీ ఎప్పుడూ ముందుంటారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వరుసగా రెండో రోజు గుజరాత్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ.. శుక్రవారం అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు నడిచే వందే భారత్ ఎక్స్‭ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. దీనికి ముందు గురువారం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‭లో జాతీయ క్రీడల్ని ప్రారంభించారు. ఈ రెండు రోజుల్లో గుజరాత్‭లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.