PM Modi: సాయంత్రం ‘లైఫ్’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యావరణానికి అనుకూలమైన మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేదావుల నుండి సలహాలు, సూచనలను ఆహ్వానించడానికి, పర్యావరణ ఉద్యమం కోసం పర్యావరణహిత జీవనశైలి (లైఫ్) అనే ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

Pm Modi
PM Modi: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యావరణానికి అనుకూలమైన మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేదావుల నుండి సలహాలు, సూచనలను ఆహ్వానించడానికి, పర్యావరణ ఉద్యమం కోసం పర్యావరణహిత జీవనశైలి (లైఫ్) అనే ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్’ను ప్రకటిస్తారు. దీనిద్వారా పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబించేలా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు, సంఘాలను ఒప్పించడానికి, ప్రభావితం చేయడానికి అవసరమైన ఆలోచనలను, సలహాలను విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు నుంచి ఆయన ఆహ్వానిస్తారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం కూడా చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
PM Kisan Samman Nidhi: 11వ విడత పీఎం కిసాన్ నిధులు మీకు అందలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి..
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో- చైర్మన్ బిల్ గేట్స్, వాతావరణ ఆర్థిక వేత్త లార్డ్ నికోలస్ స్టెర్న్, నడ్జ్ థియరీ రచయిత కాస్ సన్ స్టెయిన్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ CEO, ప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్‌గుప్తా, UNEP గ్లోబల్ హెడ్ ఇంగర్ ఆండర్సన్, UNDP గ్లోబల్ హెడ్ అచిమ్ స్టెయినర్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ తదితరులు ఈ వర్చువల్ మీటింగ్ లో పాల్గొంటారు.
TS RTC: బస్ టికెట్ కొంటే.. తిరుమల వెంకటేశ్వరుడి దర్శన టికెట్..
గతేడాది గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు(COP26) సందర్భంగా LiFE (పర్యావరణహిత జీవనశైలి) చొరవకు సంబంధించిన ఆలోచనను మోడీ ప్రవేశపెట్టారు. 2070 నాటికి భారతదేశం కార్బన్ న్యూట్రల్ గా మారుతుందని, ఆ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నట్లు గ్లాస్గో సదస్సులో ప్రధాని తెలిపాడు. దీంతో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) దావోస్ ఎజెండా 2022లో భారతదేశ వాతావరణ మార్పు, కట్టుబాట్లను నొక్కిచెప్పే P3 (ప్రో-ప్లానెట్ పీపుల్) ఉద్యమాన్ని మోడీ ప్రవేశపెట్టారు. వాతావరణానికి మన జీవనశైలి వల్ల కలిగే సవాళ్లను ప్రధాని సూచించారు.