శివసేన శివాలు : పకోడీలు, 10శాతం తప్పితే ఏమిచ్చావ్

  • Published By: venkaiahnaidu ,Published On : January 10, 2019 / 10:00 AM IST
శివసేన శివాలు : పకోడీలు, 10శాతం తప్పితే ఏమిచ్చావ్

మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విరుచుకుపడింది శివసేన. అగ్రకులాల్లోని పేదలకు 10శాతం కల్పించే బిల్లుకు బుధవారం రాజ్యసభలో ఆమోదముద్ర పడింది. అయితే ఎన్నికల కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారని, రాబోయో ఎన్నికల్లో  మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శివసేన తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్ పేజీలో గురువారం(జనవరి10,2019)ఓ కథనం ప్రచురించింది.

ఎప్పుడైతే అధికారంలోఉన్న పార్టీ రెండు ప్రధాన లక్ష్యాలు..నిరుద్యోగం, పేదరికం రూపుమాపలేకపోతే వారు రిజ్వేషన్ కార్డు ప్లే చేస్తారని  శివసేన తెలిపింది. రిజర్వేషన్లు ఇస్తే ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయని శివసేన ప్రశ్నించింది. 10శాతం రిజర్వేషన్ల వల్ల యువతకు ఏమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించింది.

ఓఇంటర్వ్యూలో యువతకు పకోడీలు అమ్ముకోవాలని సలహా ఇచ్చిన మోడీ చివరకు పేదలకు 10 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వగలిగారని తెలిపింది. మహారాష్ట్రలో మరాఠీలకు రిజర్వేషన్లు కల్పించినా వారికి ఎక్కడి నుంచి ఉద్యోగాలు తెస్తారని ప్రశ్నించింది. 2018 లో రైల్వేలలో 90 లక్షల ఉద్యోగాలకు 2.8 కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని ముంబై పోలీస్ శాఖలో 1వెయ్యి 137 పోస్టులకు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యనభ్యసించినవారేనని తెలిపింది.

గడిచిన రెండేళ్లలో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని,  దీనికి నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ప్రధాన కారణమని తెలిపింది. కొన్ని నెలలుగా మోడీ ప్రభుత్వం శివసేన తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాఫల్ విషయంలో కూడా మోడీ ప్రభుత్వ తీరుని శివసేన తప్పుబట్టింది.