40ఏళ్ల కల నెరవేరింది : అద్భుతం.. ఈ నేషనల్ వార్ మెమోరియల్

ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(ఫిబ్రవరి-25,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మెమోరియల్ ను జాతికి అంకితమిస్తున్నట్లు మోడీ ప్రకటించారు.ప్రధాని మోడీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ,నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు జాతీయ యుద్ధ స్మారకం దగ్గర పుష్పగుచ్చం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ చారిత్రక స్థలం నుంచి పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన ధైర్యవంతులైన జవాన్లకు, దేశాన్ని కాపాడేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన ధైర్యవంతులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దశాబ్దాలుగా జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించాలన్న డిమాండ్ ఉంది, గడిచిన దశాబ్దంలో ఒకటి రెండు సార్లు నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి కానీ అవి ఫలించలేదు. ప్రజల ఆశిస్సులతో 2014లో దీని ప్రాసెస్ ను ప్రారంభించాం. ఆర్మీని స్వతంత్ర శక్తిగా మార్చేందుకు నిరంతరం పనిచేస్తున్నాం. గతంలో అసాధ్యమనుకున్న నిర్ణయాలు ఇప్పుడు సాధ్యమయ్యాయి.
Read Also: పాకిస్తాన్ ముర్దాబాద్ : అమరవీరుడి అంతిమయాత్రలో నినాదాలు
దేశ రక్షణలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సహకారం అవసరం. ఈ సిద్ధాంతాల కారణంగానే మొట్టమొదటిసారిగా యుద్ధవిమానాల పైలట్లుగా అయ్యేందుకు మహిళలకు అవకాశం దక్కుతుంది. భధ్రతా దళాల్లో మహిళల పార్టిసిపేషన్ ను బలపర్చేందుకు నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. భగవద్గీతను సొంతగా చదివి అర్థం చేసుకునే వాళ్లు ఎప్పుడూ దేశ రక్షణను విస్మరించలేరు.2009లో మన భధ్రతా బలగాలు 1 లక్షా86వేల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు కావాలని డిమాండ్ చేశారు. కానీ అవి లేకుండానే శత్రువులతో పోరాడారు. నాలుగున్నరేళ్ల మా ప్రభుత్వంలో 2లక్షల 30వేల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు జవాన్లకు అందించామని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. బోఫోర్స్ నుంచి హెలికాఫ్టర్ డీల్ వరకు అన్ని దర్యాప్తు నివేదికలు ఒక కుటుంబాన్ని ప్రస్తావిస్తున్నాయన్నారు. ఇప్పుడు అదే కుటుంబం రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ దేశంలోకి రానివ్వకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు.
Read Also: జియో ఫోన్లలో కొత్త ఫీచర్: గూగుల్ అసిస్టెంట్‌లో 7 కొత్త భాషలు
40 ఎకరాల్లో నిర్మించిన ఈ జాతీయ యుద్ధ స్మారకం.. నాలుగు కూడళ్లతో ఉంటుంది. అమర్ చక్ర, వీర్థ చక్ర,త్యాగ్ చక్ర,రక్షక్ చక్ర అనే పేర్లతో ఈ నాలుగు కూడళ్లు ఉంటాయి. పరమవీరచక్ర అవార్డులు అందుకున్న వారి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దేశపు అత్యున్నత శౌర్య పురస్కారం అందుకున్న సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్,సుబేదార్ సంజయ్ కుమార్,బనాసింగ్ ల విగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. రాబోయో తరాలకు దేశం పట్ల సైనికుల అంకితభావానికి, వారి త్యాగాలను ఈ వార్ మోమోరియల్ గర్తు చేస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.అంతకుముందు స్మారకం దగ్గర సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
#WATCH Delhi: PM Narendra Modi,Defence Minister Nirmala Sitharaman and the three Service Chiefs at the #NationalWarMemorial pic.twitter.com/mb2Myw547Y
— ANI (@ANI) February 25, 2019