PM Narendra Modi : గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన, అంబాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం గుజరాత్ చేరుకున్నారు. మొదటిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

PM Narendra Modi : గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన, అంబాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు

PM Narendra Modi In Ambaji Temple

Updated On : October 30, 2023 / 12:35 PM IST

PM Modi In Ambaji Temple Gujarat : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 30,31 తేదీల్లో గుజరాత్ లో పర్యటించి పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో బిజీ బిజీగా గడపనున్నారు. దీంట్లో భాగంగా ప్రధాని గుజరాత్ కు చేరుకున్నారు.మోదీ మొదటిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా బనస్కాంత్ జిల్లాలోని అంబాజీ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

చిక్లాలోని సుందరమైన ప్రాంతంలో కొలువైన అంబాజీ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ ఆలయానికి విచ్చేసిన ప్రధానికి అర్చకులు ప్రధానికి ఘన స్వాగతం పలికి పూజలు చేయించారు. అంబాజీ ఆలయానికి చేరుకున్న సమయంలో మోదీ క్యూలో నిలబడిన భక్తులకు అభివాదం చేసుకుంటు ఆలయంలోని ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్ పర్యటన కోసం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గుజరాత్ గవర్నర్ అచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ ఘన స్వాగతం పలికారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని రూ. 5,950 కోట్లు విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు, తాగునీరు, నీటిపారుదల మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.