విపక్షాలు ఈ సంకల్పాన్ని తీసుకున్నాయి: లోక్‌సభలో మోదీ కీలక వ్యాఖ్యలు

సభకు సెంగోల్ తీసుకువచ్చి తాము కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామని మోదీ చెప్పారు.

విపక్షాలు ఈ సంకల్పాన్ని తీసుకున్నాయి: లోక్‌సభలో మోదీ కీలక వ్యాఖ్యలు

PM Narendra Modi

Updated On : February 5, 2024 / 6:04 PM IST

లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాల తీరుపై మండిపడ్డారు. విపక్షాలు చాలా కాలం విపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. అందుకు విపక్షాలను తాను ధన్యవాదాలు చెబుతున్నానని చురకలు అంటించారు.

వచ్చే ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితం అవుతారని మోదీ అన్నారు. ఓటమి కోసమే విపక్షాలు ఎంతగానో కష్టపడి పోతున్నాయని చెప్పారు. వారి తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారని అన్నారు. పార్లమెంటులో ఉన్నంత కాలం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలని హితవు పలికారు.

వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్ దుకాణం మూసివేతకు కారణం అవుతాయంటూ మోదీ విమర్శించారు. ఆ పార్టీలో వారసత్వ రాజకీయ బాధితులు ఉన్నారని మోదీ అన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ మారలేదని చెప్పారు.

సభకు సెంగోల్ తీసుకువచ్చి తాము కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించామని మోదీ చెప్పారు.

Also Read: ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం