ఆపరేషన్ శక్తికి 21 ఏళ్లు…విపక్షాలపై మోడీ ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2019 / 10:43 AM IST
ఆపరేషన్ శక్తికి 21 ఏళ్లు…విపక్షాలపై మోడీ ఫైర్

Updated On : May 11, 2019 / 10:43 AM IST

విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. విపక్ష పార్టీల నాయకులు ఇప్పుడు మోడీ కులం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధాని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(మే-11,2019)ఉత్తరప్రదేశ్ లోని సన్బాద్రాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…మోడీకి ఒకే ఒక్క కులం ఉంది.దేశంలోని పేదవాళ్లందరికీ చెందినదే ఆ కులం.ఎవరు అయితే తమను తాము పేదవాళ్లుగా అనుకుంటారో తాను వాళ్ల కులమని మోడీ తెలిపారు.

21 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత్ విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్ ఆపరేషన్ శక్తిని విజయవంతంగా పరీక్షించినట్లు మోడీ తెలిపారు.తమ కష్టంతో దేశాన్ని శక్తివంతంగా తయారుచేస్తున్న సైంటిస్టులకు ఈ సందర్భంగా  సెల్యూట్ చేస్తున్నానని మోడీ తెలిపారు.జాతీయ భద్రత కోసం బలమైన పొలిటికల్ విల్ పవర్ ఉంటే  ఏం చేయవచ్చో 1998నాటి ఈ చారిత్రక ఘటన నిరూపించిందని మోడీ అన్నారు.భారత్ కు ఎప్పుడూ అలాంటి సామర్ధ్యం ఉందని కానీ వాజ్ పేయి ప్రభుత్వానికి ముందు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలకు అలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం లేదన్నారు.జాతీయ భద్రత ప్రియారిటీగా ఉన్నప్పుడే ఇలాంటివి సాధించగలమని అన్నారు.ఈ రోజుని తానెప్పటికీ మర్చిపోలేనని మోడీ తెలిపారు.