PM Condolence: సోనియా తల్లి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోది

‘‘శ్రీమతి పావోలా మైనో మరణం పట్ల సోనియా గాంధీకి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతో మమేకమై ఉన్నాయి’’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.

PM Condolence: సోనియా తల్లి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోది

PM Tweets Condolence Message For Sonia Gandhi After Her Mother Death

Updated On : August 31, 2022 / 7:33 PM IST

PM Condolence: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తల్లి పవోలా మైనో మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోది సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోనియాకు సంతాప సందేశాన్ని చేరవేశారు మోది. ‘‘శ్రీమతి పావోలా మైనో మరణం పట్ల సోనియా గాంధీకి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ దు:ఖ సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతో మమేకమై ఉన్నాయి’’ అని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇంట్లో విషాధం చోటు చేసుకుంది. ఆమె తల్లి పవోలా మైనో ఈ నెల 27న కన్ను మూశారు. తల్లి అంత్యక్రియల కోసం సోనియా ఇటలీకి వెళ్లారు. ఆగస్టు 30న మైనో అంత్యక్రియలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న త‌న త‌ల్లిని సోనియా ప‌రామ‌ర్శించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపిన సంగ‌తి తెలిసిందే. వైద్య పరీక్షల కోసం సోనియాగాంధీ విదేశాలకు వెళ్లడం, ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్లడం తెలిసిందే.

Anand Singh: కుటుంబం మొత్తాన్ని కాల్చేస్తా అంటూ బీజేపీ మంత్రి బెదిరింపులు