Anand Singh: కుటుంబం మొత్తాన్ని కాల్చేస్తా అంటూ బీజేపీ మంత్రి బెదిరింపులు

బాధితుల ఫిర్యాదు తీసుకుని మంత్రి ఆనంద్‌ సింగ్‌తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్‌ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి ముందు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వారిని విచారించగా మంత్రి బెదిరింపులు బయటికి వచ్చాయి.

Anand Singh: కుటుంబం మొత్తాన్ని కాల్చేస్తా అంటూ బీజేపీ మంత్రి బెదిరింపులు

Karnataka minister booked for threatening to burn entire family

Anand Singh: ఒక్కోసారి తాము ప్రజలకు రక్షకులమని, వారి బాగోగులు చూసేవారిమని చెప్పుకునే వారి నుంచే ప్రజలకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. ఇండియాలో ఇలాంటి పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.. ఇలా అందరూ తమ చేతి వాటాన్ని చూపిస్తూ.. ప్రజలపై కొరడాలు ఝుళిపిస్తున్న ఉదంతాలు అనేకం ప్రతిరోజు వింటూనే ఉన్నాం.

తాజాగా, తమ గోడు చెప్పుకోవడానికి వెళ్లిన ఒక కుటుంబానికి ఏకంగా మంత్రి నుంచే బెదిరింపులు వచ్చాయి. తాను చెప్పినట్లు వినకపోతే కుటుంబం మొత్తాన్ని కాల్చి పారేస్తా అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధిత కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పుకుంది. కర్ణాటకలోని హొసపెట్టెలో జరిగింది ఇది.

కర్ణాటక పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌ మంగళవారం హోస్పెట్‌ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన పోలప్ప అనే వ్యక్తి.. భూవివాదంలో మరో వర్గానికి చెందిన వారు తమను ఇబ్బంది పెడుతున్నారని మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. అయితే గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారికి మంత్రి ఆనంద్‌ సింగ్‌ వార్నింగ్ ఇచ్చారు. తాము చెప్పింది చేయాలని, లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాల్చిపడేస్తానని బెదిరించాడు.

బాధితుల ఫిర్యాదు తీసుకుని మంత్రి ఆనంద్‌ సింగ్‌తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్‌ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి ముందు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వారిని విచారించగా మంత్రి బెదిరింపులు బయటికి వచ్చాయి.

Economy Grows: జీడీపీ @13.5.. జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థకు రికార్డ్ బూస్టింగ్