Economy Grows: జీడీపీ @13.5%.. జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థకు రికార్డ్ బూస్టింగ్

వారి అంచనాలను అటు ఇటుగా నిజం చేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం గమనార్హం. కాగా, కొవిడ్ మహమ్మారి అనంతరం 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా 20.1 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.

Economy Grows: జీడీపీ @13.5%.. జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థకు రికార్డ్ బూస్టింగ్

Economy Grows 13.5% In June Quarter

Economy Grows: అప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్ కుదేలు చేసింది. ఒకానక సమయంలో దేశ జీడీపీ -20 శాతానికి పోయిందంటే.. ఎంతటి విపత్కర పరిస్థితో ఎదుర్కోవచ్చు. కొవిడ్ అంశం ముగిసినా ఇప్పట్లో పైకి లేచేనా అనే అనుమానాల నడుమ.. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కాగా, తాజాగా ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది.

గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోల్చినపుడు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 13.5 శాతం అధిక వృద్ధి నమోదైంది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఇది 4.1 శాతం ఉండేది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ బుధవారం విడుదల చేసిన వివరాల ప్రకారం, జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో స్థూల దేశీయోత్పత్తి అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోల్చినపుడు 13.5 శాతం అధిక వృద్ధి రేటు నమోదైంది.

రాయిటర్స్‭లో ఆర్థికవేత్తలు నిర్వహించిన పోల్ ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మన ఆర్థిక వ్యవస్థ 15.2 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేశారు. అనేక మంది భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధితో ముందుకు సాగుతుందని చెప్పారు. వారి అంచనాలను అటు ఇటుగా నిజం చేస్తూ.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం గమనార్హం. కాగా, కొవిడ్ మహమ్మారి అనంతరం 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా 20.1 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.

Cabinet approves: రాష్ట్రాలకు రాయితీతో పప్పు ధాన్యాలు.. కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం