కాంగ్రెస్ కు మోడీ సవాల్…పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇస్తామని చెప్పండి

  • Published By: venkaiahnaidu ,Published On : December 17, 2019 / 10:20 AM IST
కాంగ్రెస్ కు మోడీ సవాల్…పాకిస్తానీలందరికీ పౌరసత్వం ఇస్తామని చెప్పండి

Updated On : December 17, 2019 / 10:20 AM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని అనేకప్రాంతాల్లో నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రధాని మోడీ సవాల్ విసిరారు.

ఇవాళ(డిసెంబర్-17,2019) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్ లోని జర్హయిత్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ…కాంగ్రెస్,దాని మిత్ర పక్షాలకు ఓ ఓపెన్ సవాల్ విసురుతున్నాను. ప్రతి పాకిస్తానీని భారతీయ పౌరుడిగా మార్చాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ,దాని మిత్రపక్షాలు ఆ విషయాన్ని దమ్ముంటే డిక్లేర్ చేయాలి. అప్పుడు దేశప్రజలు వారికి తగిన బుద్ది చెబుతారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో భయాన్ని సృష్టిస్తోందని కూడా మోడీ ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీ దేశంలో తప్పుడు ప్రచారాలు,భయపెట్టే రాజకీయాలు చేస్తుందని మోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం వల్ల దేశంలోని ఏ వ్యక్తీకి ఇబ్బంది జరగదని మోడీ సృష్టం చేశారు. ఈ చట్టం ద్వారా దేశంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది జరగదని తాను మరోసారి రిపీట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పొరుగుదేశాల్లో పీడించబడి మన దేశంలోకి వచ్చిన మైనార్టీల కోసమే ఈ చట్టం తెచ్చామని మోడీ తెలిపారు.