గడ్చిరోలి జిల్లాలో పోలీసుల కూంబింగ్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడితో అప్రమత్తమైన పోలీసులు.. కూంబింగ్ ముమ్మరం చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్‌కేడ్, వడ్సా, జాంబీర్ కేడ్ గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో సీ60 కమాండోస్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో జల్లడపడుతున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్జ్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం (మే1, 2019)న జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని శక్తిమంతమైన ఐఈడీ బాంబుతో మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది జవాన్లతోపాటు వాహన డ్రైవర్ ప్రాణాలొదిలారు. పక్కా ప్రణాళికతోనే మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. గడ్చిరోలి ప్రభుత్వాసుపత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.