గోల్డ్ రష్ : రూ.57 కోట్ల విలువైన బంగారం పట్టివేత

సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏపీ-తమిళనాడు బోర్డర్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 07:09 AM IST
గోల్డ్ రష్ : రూ.57 కోట్ల విలువైన బంగారం పట్టివేత

సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏపీ-తమిళనాడు బోర్డర్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏపీ-తమిళనాడు బోర్డర్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుపడింది. అరంబాక్కంలో ఓ వాహనంలో తరలిస్తున్న 175 బంగారం కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.57కోట్లుగా తేల్చారు. ఈ బంగారం ఏపీకి చెందిన సిద్ధార్థ్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బంగారాన్ని ముంబైకి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్

ఇరు రాష్ట్రాల బోర్డర్ లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఓ వాహనంలో తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దీనికి సంబంధించి ఎలాంటి బిల్లులు, పత్రాలు లేకపోవడంతో పోలీసులు బంగారాన్ని సీజ్ చేశారు. చెన్నైకి తరలించి అక్కడి నుంచి ముంబైకి తరలించాలని ప్లాన్ వేశారు. ముంబైలో కడ్డీలను కరిగించి ఆభరణాలు చేయించాలని అనుకున్నారు. దీన్ని కడ్డీల రూపంలో ఉన్న ముడి బంగారంగా తేల్చారు.

వీటిని ముడి బంగారం అంటారని, ఆర్నమెంట్స్ చెయ్యడానికి వాడతారని పోలీసులు తెలిపారు. ఈ బంగారం ఏపీకి చెందిన సిద్దార్థ్ అనే వ్యక్తికి చెందినదని పోలీసులకు పట్టుబడిన వ్యక్తులు చెప్పారు. దీంతో సిద్ధార్థ్ ఎవరు, అతడు ఏం చేస్తాడు అనే వివరాలు ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసిన దర్యాఫ్తు చేపట్టారు.
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ