Patna : రియల్ లైఫ్ రాఖీని చూశారా..? 7 వేల మంది రాఖీలు కట్టి..
రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కి చేతినిండా అమ్మాయిలు రాఖీ కట్టే సీన్ గుర్తుందా? రియల్ లైఫ్‌లో అలాంటి సీన్ పాట్నాలో కనిపించింది. ఖాన్ సర్‌కి 7 వేల మంది విద్యార్ధినులు రాఖీలు కట్టారు. ఎవరా ఖాన్ సర్?

Patna
Patna : ఆయన పేరు ఖాన్ సర్. కోచింగ్ సెంటర్ ఓనర్. ఆయన కోచింగ్ సెంటర్‌కి 10,000 మంది విద్యార్ధులు వచ్చారు. 7,000 మంది విద్యార్ధినులు ఆయనకు రాఖీలు కట్టారు. ఇది ప్రపంచ రికార్డుగా ఖాన్ సర్ చెబుతున్నారు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కి అమ్మాయిలు రాఖీ కట్టే సీన్‌ను తలపించిన ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
Raksha Bandhan 2023 : ఇండిగో విమానంలో రక్షాబంధన్ వేడుక .. పైలట్‌కు రాఖీ కట్టిన సోదరి
పాట్నాకు చెందిన ప్రముఖ విద్యావేత్త ఖాన్ సర్‌కి సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. అనేక మాధ్యమాల్లో క్రమం తప్పకుండా ఆయన వీడియోలు వైరల్ అవుతుంటాయి. రక్షాబంధన్ సందర్భంగా తన కోచింగ్ సెంటర్‌లో ఆయన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు బ్యాచ్‌లకు సంబంధించిన విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో 7 వేల మంది విద్యార్ధినులు ఆయనకు రాఖీలు కట్టారు. గతంలో ఎక్కడా ఇలాంటిది జరగలేదని, ఇది ప్రపంచ రికార్డు అని ఖాన్ సర్ అంటున్నారు. ఈ ఈవెంట్ 2.5 గంటలపాటు కొనసాగిందట. ఖాన్ సర్ కి సిస్టర్లు లేకపోవడం వల్ల తన విద్యార్ధినులను చెల్లెళ్లుగా భావించి ఏటా ఇలా రాఖీలు కట్టించుకుంటారట.
Raksha Bandhan 2023 : ఇది కదా అసలైన రక్షాబంధన్ అంటే .. సోదరుడికి రాఖీ కట్టి కిడ్నీ దానం చేసిన అక్క
జనరల్ స్టడీస్ బోధించే ఖాన్ సర్ టీచింగ్ స్టైల్ ఎంతో ఫేమస్ అట. చరిత్ర, జియో పాలిటిక్స్, జియోగ్రఫీ ఎక్కువగా బోధిస్తారు. ఆయన పాఠాలు చెప్పే వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ ఉంటాయి. ఖాన్ సర్ గోరఖ్ పూర్‌లో సైనిక కుటుంబంలో 1993 లో జన్మించారు. తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఖాన్ సర్ కూడా ఆర్మీలో చేరాలకున్నారు. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆయనకు మిలియన్ల సంఖ్యలో యూట్యూబ్ ఫాలోవర్లు ఉన్నారు. తన క్లాసులకు తక్కువ ఫీజు వసూలు చేస్తూ ఖాన్ సర్ పాఠాలు చెబుతూ ముందుకు వెళ్తున్నారు.