Goa Elections : పోటీ నుంచి తప్పుకున్న ప్రతాప్ సిన్హ్‌‌రాణె.. కోడలి కోసమేనా ?

కోడలి కోసమే ఆయన బరిలోనుంచి తప్పుకున్నట్లు టాక్‌ నడుస్తోంది. గత 50 ఏళ్లుగా పోరియెం నియోజకవర్గంలో తిరుగులేని విజయం సాధిస్తున్న కాంగ్రెస్‌కు ఇది గట్టి దెబ్బే అంటున్నారు నిపుణులు...

Goa Elections : పోటీ నుంచి తప్పుకున్న ప్రతాప్ సిన్హ్‌‌రాణె.. కోడలి కోసమేనా ?

Goa Polls

Updated On : January 28, 2022 / 2:10 PM IST

Pratap Singh Rane Poriem Assembly Constituency : అసెంబ్లీ ఎన్నికలకు ముందు గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం ప్రతాప్‌సిన్హ్‌ రాణె పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. వయసు రీత్యా తాను ఎన్నికల బరి నుంచి వెనక్కి తగ్గినట్లు రాణె వెల్లడించారు. అయితే తాను పోటీ చేస్తున్న స్థానం నుంచే ఆయన కోడలు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో రాణె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌ నేత అయిన రాణెను మరోసారి పోరియెం నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు పార్టీ నిర్ణయించింది.

Read More : Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”? అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

ఈ మేరకు గతేడాది డిసెంబరులోనే ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరు ఉండడంతో ఆ సీటు తమదేననే ధీమాతో ఉంది కాంగ్రెస్‌ పార్టీ. కానీ ఇంతలోనే ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే గతవారం పోరియెం నియోజకవర్గం నుంచి రాణె కోడలు దివ్య విశ్వజిత్ రాణె పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. తన కోడలికి బీజేపీ టికెట్‌ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని గతంలోనే ప్రతాప్‌సిన్హ్‌ రాణె కాషాయ పార్టీకి ఆఫర్‌ ఇచ్చినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

Read More : AP PRC : మేము వారితోనే అంటున్న ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక.. కీలక నిర్ణయం

దీంతో కోడలి కోసమే ఆయన బరిలోనుంచి తప్పుకున్నట్లు టాక్‌ నడుస్తోంది. గత 50 ఏళ్లుగా పోరియెం నియోజకవర్గంలో తిరుగులేని విజయం సాధిస్తున్న కాంగ్రెస్‌కు ఇది గట్టి దెబ్బే అంటున్నారు నిపుణులు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆరు సార్లు సీఎంగా వ్యవహరించారు. రాష్ట్రానికి రాణె అందించిన సేవలను గుర్తించి ఇటీవలే గోవా ప్రభుత్వం ఆయనకు జీవితకాల కేబినెట్‌ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాణె పోటీ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

ప్రస్తుతం గోవాలో 40 స్థానాలున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 14వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. 2017లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది. కానీ..సాధారణ మెజార్టీ 21 కాగా..కాంగ్రెస్ కేవలం 17 సీట్లు సాధించి..అధికార పీఠానికి కొద్దిదూరంలో ఆగిపోయింది. బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతు తీసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం పెరిగిపోయింది.