పంజాబ్‌లో మోడీ : గురుద్వారాలో ప్రార్థనలు

  • Published By: madhu ,Published On : November 9, 2019 / 05:56 AM IST
పంజాబ్‌లో మోడీ : గురుద్వారాలో ప్రార్థనలు

Updated On : November 9, 2019 / 5:56 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రానికి చేరుకున్నారు. సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం పంజాబ్ చేరుకున్న మోడీకి పంజాబ్ గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి కౌర్‌తో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. మాజీ శిరోమణి గురుద్వార ప్రబందక్ కమిటీ చీఫ్ జాగిర్ కౌర్..మోడీని సత్కరించారు. అనంతరం చారిత్రాత్మకమైన బెర్ సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 20 నిమిషాల పాటు మోడీ అక్కడ గడిపారు. మోడీతో పాటు ఎంపీ సన్నిడియోల్ కూడా పాల్గొన్నారు. 

గురుద్వారాను ఐదు లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా గురుద్వారాను అందంగా అలంకరించారు. పువ్వులు, హోర్డింగ్, అనేక రంగులతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. గురునానక్ దేవ్ 14 సంవత్సరాల పాటు సుల్తాన్ పూర్‌లోని లోథీలో గడిపాడని, పవిత్ర కాశీబీన్‌లో రోజువారీ స్నానం చేసేవాడని భక్తుల నమ్మకం. 

మరోవైపు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు సంచలానత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు అయోధ్య కేసులో ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించినా..దానిని ఏ ఒక్క వర్గానికో గెలుపు ? లేదా ఓటమి ? అనే కోణం నుంచి చూడనే కూడదు. శాంతి సామరస్యాల పరిరక్షణణ, సుహృద్బావం అనేది మన సుసంపన్న సంప్రదాయం. అయోధ్యపై సుప్రీంకోర్టు నిర్ణయం ఈ అత్యున్నత సంప్రదాయాన్ని మరింత పరిపుష్టం చేసేలా చూడడం మనందరి ప్రప్రథమ ప్రాధాన్యం కావాలి. దేశ ప్రజలందరికీ అదే నా అభ్యర్థన. తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను చక్కగా కాపాడుకోవాలి’. అని ట్వీట్ చేశారు.
Read More : అయోధ్య కేసు తీర్పు : ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం – సీజేఐ
గురునానక్ జయంతి పురస్కరించుకొని నవంబర్ 9వ తేదీన కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. పాక్, భారత్ మధ్య ప్రతినిధులు సంతకం చేశారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి కర్తార్ పూర్ గురుద్వారాకు మార్గం కలిగి ఉంది.