PM Modi Second Day Visit : రెండవరోజు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. బీజేపీ సీఎంలతో భేటీ

ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

PM Modi Second Day Visit : ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. మంగళవారం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పీఎం భేటీ కానున్నారు. వీరితో పాలన సంబంధమైన విషయాలపై చర్చించనున్నారు. యోగ ఫౌండేషన్ ధ్యాన కేంద్రంలో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం 3.30గంటలకు ప్రధాని మోదీ వారణాసిలోని స్వర్వేద్ మహామందిర్‌లో సద్గురు సదాఫల్దీయో విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకలకు మోదీ హాజరవుతారు.

చదవండి : PM Modi In Varanasi : వారణాశిలో గంగా హారతిని తిలకించిన మోదీ

తర్వాత ప్రధాని మోదీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో సదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశానికి బీహార్, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. PMO వివరాల ప్రకారం, ముఖ్యమంత్రులు తమ పాలనకు సంబంధించిన పద్ధతులను మోదీతో పంచుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ప్రధానమంత్రి “టీమ్ ఇండియా స్ఫూర్తిని పెంపొందించే దృక్పథానికి” అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. సుపరిపాలన ఎలా ఉండాలో ముఖ్యమంత్రుల ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఆ తర్వాతి రోజు అధికారులు
సీఎంలు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శిస్తారు.

చదవండి : PM Modi : కార్మికుల మధ్య కూర్చొని మోదీ లంచ్

ఇక ఇదిలా ఉంటే నగరంలోని అభివృద్ధి పనులను పరిశీలించే భాగంగా సోమవారం అర్థరాత్రి మోదీ వారణాసి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు మోదీ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి, పరిశీలనకు వెళ్లిన మోదీ కాశీ పట్టణ ప్రజలకు, పర్యాటకులకు ఉత్తమమైన మౌలిక సదుపాయాలను అందించాలని కోరారు. ఈ మేరకు రైలు కనెక్టివిటీని పెంపొందించడంతోపాటు పరిశుభ్రమైన, ఆధునికమైన, ప్రయాణీకులకు అనుకూలమైన రైల్వే స్టేషన్లను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ట్రెండింగ్ వార్తలు