PM Modi : కార్మికుల మధ్య కూర్చొని మోదీ లంచ్

వారణాశి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇవాళ కాశీ విశ్వనాథ్​ కారిడార్ ప్రారంభించిన తర్వాత అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్​ నడవా నిర్మాణంలో

PM Modi :  కార్మికుల మధ్య కూర్చొని మోదీ లంచ్

Modi8

PM Modi : వారణాశి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఇవాళ కాశీ విశ్వనాథ్​ కారిడార్ ప్రారంభించిన తర్వాత అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్​ నడవా నిర్మాణంలో భాగస్వామ్యమైన కార్మికుల మధ్యలో కూర్చొని మోదీ లంచ్ చేశారు. అంతకుముందు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయంలో కార్మికులపై మోదీ పూలు జల్లారు. అనంతరం వారి మధ్యలో కూర్చొని ఫొటో కూడా దిగారు మోదీ.

కాగా, వారణాసి ఎంపీగా.. కాశీ విశ్వనాథ్​ కారిడార్ పనులకు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేయగా, రూ.339 కోట్లతో పూర్తయిన కాశీ విశ్వనాథ్​ నడవా తొలి దశ పనులను ఇవాళ మోదీ ప్రారంభించారు.  కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాతన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోదీ అన్నారు.

కాశీ విశ్వనాథ్ మందిర చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, దీన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాశీక్షేత్ర అభివృద్ధి కారిడార్​ను దేశ ప్రజలకు అంకితం చేసిన అనంతరం ప్రసంగించిన మోదీ.. ఈ ప్రాజెక్టుతో ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకోవచ్చన్నారు.వృద్ధులు, దివ్యాంగుల కోసం విశ్వ‌నాథ ఆల‌యంలో ఎస్క‌లేట‌ర్లు ఏర్పాటు చేశామ‌న్నారు.

కాశీ… చరిత్రను,ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందన్నారు. చాలా మంది సుల్తానులు వచ్చి వెళ్లిపోయారు కానీ ఈ ప్రదేశం ఇక్కడే ఉందన్నారు. తీవ్రవాదంతో సంస్కృతిని చంపడానికి ఔరంగజేబు ప్రయత్నించిన తీరును చరిత్ర చూసిందన్నారు మోదీ. కానీ ఈ దేశంలో ఒక ఔరంగజేబు ఒక శివాజీతో పోల్చబడుతున్నాడన్నారు. కాలచక్రాన్ని గమనిస్తే.. కాశీ ముందుకు సాగుతున్నప్పుడు భయాందోళనలను రేకెత్తించిన వ్యక్తులు చరిత్ర పుటలకే పరిమితమయ్యారని మోదీ అన్నారు.

కాశీలో ప్ర‌తి రాయి శివుడే.. కాశీకి సేవ చేయ‌డం అనంతం.. కాశీ భార‌త సంస్కృతిక రాజ‌ధాని అని మోదీ అన్నారు. భార‌త్‌లో భ‌క్తిని ఢీకొనే శ‌క్తి దేనికీ లేద‌న్నారు. నేటి భార‌త్.. కోల్పోయిన వైభ‌వాన్ని అందుకుంటోంద‌న్నారు. చోరీకి గురైన అన్న‌పూర్ణ విగ్ర‌హం మ‌ళ్లీ వందేళ్ల త‌ర్వాత ఇండియాకు వ‌చ్చింద‌న్నారు. దేశం కోసం మీరంతా మూడు సంక‌ల్పాలు తీసుకోవాల‌న్నారు. స్వ‌చ్ఛ‌త‌, సృజ‌న్‌, ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ కోసం నిరంత‌రం ప్ర‌య‌త్నం చేశాల‌ని మోదీ అన్నారు. స్వ‌చ్ఛ‌త జీవ‌న శైలి కావాల‌న్నారు. దేశం అభివృద్ధి ఎంత సాధించినా.. స్వ‌చ్ఛ‌త చాలా కీల‌కం అన్నారు. ఆత్మ నిర్భ‌ర భార‌త్ చాలా అవ‌స‌రం అన్నారు.

ALSO READ Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని