Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి పట్టణంలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్ కారిడార్​'మొదటి ఫేజ్ ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.399 కోట్లతో పూర్తయిన తొలిదశ పనుల ప్రారంభోత్సవం

Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని

Modi

Kashi Vishwanath Corridor : ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి పట్టణంలో నిర్మించిన ‘కాశీ విశ్వనాథ్ కారిడార్​’మొదటి ఫేజ్ ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన 3 వేల మంది సాధువులు, మత పెద్దలు. కళాకారులు, పురప్రముఖులతో పాటు బీజేపీ పాలిత 12 రాష్ట్రాల సీఎంలూ పాల్గొన్నారు.

రూ.399 కోట్లతో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ తొలిదశ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడుతూ…ఎన్నో ఏళ్లు వేచిచూసిన సమయం ఆసన్నమైందన్నారు. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించామన్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాతన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని  మోదీ అన్నారు. భవిష్యత్​ కోసం పూర్వీకులు అందించిన ప్రేరణ ఇక్కడ కనిపిస్తుందని తెలిపారు.

ఈ ప్రాజెక్టుతో ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకోవచ్చని అన్నారు. భారత ప్రాచీనతకు, సాంప్రదాయానికి కాశీ ప్రతీక అని.. కాశీలో అడుగుపెట్టగానే అంతరాత్మ మేల్కొంటుందని మోదీ అన్నారు.

Kasi

మోదీ మాట్లాడుతూ…”ఇక్కడకు రావడం గర్వంగా అనిపిస్తుంది. కాశీ అందరిది. గంగా అందరిది. విశ్వనాథుడి ఆశీస్సులు అందరివి. కానీ, సమయానుగుణంగా కాశీ విశ్వనాథుడిని, గంగాదేవిని దర్శించుకోవడం కష్టమైపోయింది. ఇక్కడ స్థలం ఇరుకుగా ఉండేది. కానీ విశ్వనాథ్ ధామ్ పూర్తి అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం సులభమవుతుంది. దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకుంటారు. 3000 వేల చదరపు కిలోమీటర్లు ఉన్న మందిరాన్ని, 5 లక్షల చదరపు కిలోమీటర్లకు విస్తరించాం. 50 వేల మంది మందిరాన్ని దర్శించుకోవచ్చు”అని తెలిపారు.

కాశీ విశ్వనాథ్ నడవాను ప్రజలకు అంకితం చేసిన ప్రధాని.. ఈనాటి కార్యక్రమంతో గంగా నది ప్రసన్నమైందన్నారు. కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతుందన్నారు. విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారని మోదీ అన్నారు. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదన్నారు. అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయని మోదీ అన్నారు.

కాశీ… చరిత్రను,ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందన్నారు. చాలా మంది సుల్తానులు వచ్చి వెళ్లిపోయారు కానీ ఈ ప్రదేశం ఇక్కడే ఉందన్నారు. తీవ్రవాదంతో సంస్కృతిని చంపడానికి ఔరంగజేబు ప్రయత్నించిన తీరును చరిత్ర చూసిందన్నారు మోదీ. మతోన్మాదంతో సంస్కృతిని అణచివేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రపంచం కంటే భారతనేల భిన్నమైంది. ఇక్కడ మొఘల్​ చక్రవర్తి ఔరంగజేబు​ వస్తే.. అక్కడ మరాఠా యోధుడు శివాజీ కూడా పుట్టుకొచ్చాడు. కాలచక్రాన్ని గమనిస్తే.. కాశీ ముందుకు సాగుతున్నప్పుడు భయాందోళనలను రేకెత్తించిన వ్యక్తులు చరిత్ర పుటలకే పరిమితమయ్యారని మోదీ అన్నారు.

కాశీలో ప్ర‌తి రాయి శివుడే.. కాశీకి సేవ చేయ‌డం అనంతం.. కాశీ.. భార‌త సంస్కృతిక రాజ‌ధాని అని మోదీ అన్నారు. భార‌త్‌లో భ‌క్తిని ఢీకొనే శ‌క్తి దేనికీ లేద‌న్నారు. నేటి భార‌త్.. కోల్పోయిన వైభ‌వాన్ని అందుకుంటోంద‌న్నారు. చోరీకి గురైన అన్న‌పూర్ణ విగ్ర‌హం మ‌ళ్లీ వందేళ్ల త‌ర్వాత ఇండియాకు వ‌చ్చింద‌న్నారు. దేశం కోసం అందరూ మూడు సంక‌ల్పాలు తీసుకోవాల‌ని మోదీ అన్నారు. స్వ‌చ్ఛ‌త‌, సృజ‌న్‌, ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ కోసం నిరంత‌రం ప్ర‌య‌త్నం చేశాల‌ని మోదీ అన్నారు. స్వ‌చ్ఛ‌త జీవ‌న శైలి కావాల‌న్నారు. దేశం అభివృద్ధి ఎంత సాధించినా.. స్వ‌చ్ఛ‌త చాలా కీల‌కం అన్నారు. ఆత్మ నిర్భ‌ర భార‌త్ చాలా అవ‌స‌రం అన్నారు.

Kasi2

Kasi245

 

అంతుకుముందు, కాశీ విశ్వ‌నాథుడికి ప్ర‌ధాని మోదీ జ‌లాభిషేకం చేశారు. గంగా న‌దిలో(లలితా ఘాట్​ దగ్గర) పుణ్య స్నానం చేసి.. ఆ న‌ది జ‌లంతో కాశీ విశ్వనాథుడి ఆలయానికి చేరుకున్న ప్రధాని అక్కడ పూజలు చేశారు. గ‌ర్భ‌గుడిలో గంగా జ‌లంతో మోదీ చేత విశ్వ‌నాధుడికి అభిషేకం చేయించారు పండితులు. విశ్వ‌నాధుడికి నైవేద్యం స‌మ‌ర్పించారు మోదీ. పూజారులు ప్ర‌ధాని మోదీకి ఆశీర్వాదాలు అందించారు.

Kasi246

 

 

Kasi24

కాశీ విశ్వనాథుడి ఆలయంలో.. కార్మికులపై ప్రధాని మోదీ పూలు జల్లారు. ఈ ఆలయ నడవా నిర్మాణంలో వీరంతా భాగస్వామ్యం అయ్యారు. అనంతరం వారి మధ్యలో కూర్చొని ఫొటో దిగారు మోదీ.