BJP భారీ స్కెచ్ : మోడీ మారథాన్ ర్యాలీలు

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 01:31 AM IST
BJP భారీ స్కెచ్ : మోడీ మారథాన్ ర్యాలీలు

Updated On : March 27, 2019 / 1:31 AM IST

ప్రధాన మంత్రి మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. మే17 వరకూ మొత్తం 125 ర్యాలీల్లో పార్టీ తరపున క్యాంపైనింగ్ చేయబోతున్నారు. దీని కోసం బిజెపి భారీ స్కెచ్ వేసింది. మూడు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా విభజించనున్నారు. విజయ్ సంకల్ప్ సభతో ప్రారంభమైన ఈ వ్యూహం..చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసేవరకూ ఒకే ఊపులో కొనసాగేలా హోరెత్తనుంది. మొత్తం 200 సభలు ఆదివారం ఒకే రోజున నిర్వహించింది. వీటిలో ఎక్కడా మోడీ పాల్గొనలేదు.

మార్చి 28నుంచి మోడీ మారథాన్ ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి మే 17 వరకూ అదే ఊపు కొనసాగిస్తే..ప్రత్యర్ధులపై పైచేయి సాధించవచ్చనేది బిజెపి ప్లాన్. 
మార్చి 28న మీరట్, జమ్ములో మోడీ ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత మార్చి 29, ఏప్రిల్ 1 రెండు రోజులు ఒడిశాలో ప్రచారం నిర్వహిస్తారు. మార్చి 30న అస్సోంలో రెండు, వెస్ట్ బెంగాల్‌లో ఏప్రిల్ 3న రెండు ర్యాలీలు నిర్వహిస్తారు మోడీ. ఆ తర్వాత ఐటానగర్‌లో మార్చి 31న మైభీ చౌకీదార్ కార్యక్రమం ఏర్పాటు చేసింది బిజెపి. ఇదే పోల్ క్యాంపైనింగ్‌లో కీలకమైన సమావేశంగా చెప్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించే తీరుని బట్టే ఆ తర్వాత ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది డిసైడ్ కాబోతోంది.

2014లోనూ మోడీ ఇదే రకంగా భారీగా ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో దాదాపు 425 ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారని అంచనా. ప్రస్తుత ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో 20, బీహార్, పశ్చిమబెంగాల్‌లో పది పది చొప్పున..ర్యాలీలలో మోడీ ప్రచారం చేస్తారని బిజెపి చెప్తోంది. ఈ 3 రాష్ట్రాల్లో 162 ఎంపీ సీట్లుండగా గత ఎన్నికలలో బిజెపి 106 సీట్లు గెలుచుకుంది. అందుకే ఈ రాష్ట్రాలపై బిజెపి ఫోకస్ పెట్టింది. దశలవారీగా జరిగే ఎన్నికలలో ప్రతి ఫేజ్‌లో మోడీ ఇక్కడకు వచ్చేలా ప్లాన్ చేసింది.