Priyanka Gandhi: మల్లిఖార్జున్ ఖర్గేకు జేపీ నడ్డా లేఖ.. ప్రియాంక గాంధీ ఫైర్
మల్లికార్జున ఖర్గేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాయడంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె హిందీలో ట్వీట్ చేశారు.

Priyanka Gandhi Vadra
Mallikarjun kharge – JP Nadda: బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతుంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి గత రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖపై గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఖర్గేకు కౌంటర్ లేఖను పంపించారు. రాహుల్ గాంధీని విఫల నాయకుడిగా లేఖలో నడ్డా అభివర్ణించారు. పలు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోందని నడ్డా అన్నారు.
Also Read : iphone 16 : పది నిమిషాల్లో మీ చెంతకు ఐఫోన్ -16 సిరీస్ ఫోన్లు.. ఎలా అంటే..?
యువరాజు ఒత్తిడితో కాంగ్రెస్ ‘కాపీ అండ్ ఫేస్ట్’ పార్టీగా మారిందంటూ ఖర్గేకు రాసిన లేఖలో జేపీ నడ్డా ఆరోపించారు. మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మరిచిపోయినట్లు అనిపిస్తుంది. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించా.. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడితో కాపీ అండ్ పేస్ట్ పార్టీగా మారిపోవటం బాధాకరం అంటూ లేఖలో నడ్డా పేర్కొన్నారు.
మల్లికార్జున ఖర్గేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాయడంపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె హిందీలో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ రాశారు.. ప్రధానమంత్రికి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం ఉంటే ఈ లేఖకు ఆయన స్వయంగా సమాధానం ఇచ్చి ఉండేవారు. బదులుగా అతను జేపీ నడ్డా ద్వారా తక్కువ స్థాయి, దూకుడుగా ప్రత్యుత్తరం రాసి పంపారు. 82ఏళ్ల సీనియర్ ప్రజా నాయకుడిని అగౌరవపర్చాల్సిన అవసరం ఏముందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం యొక్క సంప్రదాయం, సంస్కృతి ప్రశ్నలు అడగడం, సంభాషించడం. సమాజంలో కూడా గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదు. ఖర్గే లేఖకు స్వయంగా సమాధానం ఇచ్చిఉంటే ప్రధాని మోదీకి గౌరవంగా ఉండేది. ప్రజల దృష్టిలో ఆయన గౌరవం మరింత పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో ఉన్న నాయకులు ఈ గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం విచారకరమని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
कुछेक भाजपा नेताओं और मंत्रियों की अनर्गल और हिंसक बयानबाज़ी के मद्देनज़र लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जीवन की सुरक्षा के लिए चिंतित होकर कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खरगे जी ने प्रधानमंत्री जी को एक पत्र लिखा।
प्रधानमंत्री जी की…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2024