Priyanka Gandhi : మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీపై ఈడీ ఛార్జిషీట్‌

పీఎంఎల్‌ఏ కేసులో ఈడీ ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు పెట్టారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన చార్జ్ షీటులో పేర్కొంది....

Priyanka Gandhi : మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీపై ఈడీ ఛార్జిషీట్‌

Priyanka Gandhi

Updated On : December 28, 2023 / 11:07 AM IST

Priyanka Gandhi : పీఎంఎల్‌ఏ కేసులో ఈడీ ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు పెట్టారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన చార్జ్ షీటులో పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త సీసీ థంపీకి భూమిని విక్రయించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది.

ALSO READ : Ayodhya : రామాలయం ప్రారంభం నేపథ్యంలో అయోధ్య రైల్వేస్టేషన్ పేరు మార్పు

ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందు ఛార్జ్ షీట్‌లలో వాద్రా పేరును థంపీ సన్నిహితుడిగా ఈడీ పేర్కొన్నప్పటికీ, ప్రియాంక పేరు ప్రస్తావనకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ, మనీలాండరింగ్, విదేశీ మారక ద్రవ్యం, నల్లధనం చట్టాల ఉల్లంఘన, అధికారిక రహస్యాల చట్టంపై పలు ఏజెన్సీలు విచారిస్తున్నాయి.

ALSO READ : Ayodhya Ram Mandir : రామమందిర ప్రారంభ ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు…ఏం ఇస్తారంటే…

రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీని నిందితులుగా పేర్కొనకపోయినా థంపి, వాద్రాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడానికి భూమి లావాదేవీలను ఈడీ ప్రస్తావించింది. వాద్రా, థంపిల మధ్య జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను కూడా ఈడీ అందజేసింది. థంపి వాద్రా నుంచి ల్యాండ్ క్రూయిజర్ కారును కొనుగోలు చేశారని, దీని కోసం అతని నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ ఖాతా నుంచి చెక్కుల ద్వారా చెల్లింపులు చేశారని ఈడీ పేర్కొంది.