Ayodhya : రామాలయం ప్రారంభం నేపథ్యంలో అయోధ్య రైల్వేస్టేషన్ పేరు మార్పు

పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు....

Ayodhya : రామాలయం ప్రారంభం నేపథ్యంలో అయోధ్య రైల్వేస్టేషన్ పేరు మార్పు

Ayodhya Dham

Updated On : January 8, 2024 / 12:23 PM IST

Ayodhya : పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు వేలాదిమంది ప్రజలు రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.

ALSO READ : DMDK chief Vijayakanth : డీఎండీకే అధినేత విజయకాంత్‌కు కొవిడ్ పాజిటివ్…ఆసుపత్రికి తరలింపు

జనవరి 22వతేదీన ఆలయ ప్రారంభ కార్యక్రమానికి ముందు డిసెంబర్ 30 వతేదీన ఆలయ పట్టణం అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ రోడ్‌షో, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయోధ్య రైల్వే స్టేషన్ అత్యాధునిక సదుపాయం కల్పించనున్నారు. వివిధ ఏజెన్సీల అధికారులు ప్రధాని పర్యటనకు ముందు సన్నాహాలను పరిశీలించారు.

ALSO READ : Bus Catches Fire : బస్సులో చెలరేగిన మంటలు…13మంది మృతి, మరో 17 మందికి గాయాలు

అయోధ్యలోని రామ్‌పథం, ఇతర వీధుల వెంబడి ఉన్న దుకాణాల షట్టర్‌లు హిందూ-థీమ్ ఆర్ట్‌వర్క్‌తో అలంకరించారు.ఆలయ దర్శనానికి వచ్చే ప్రయాణీకుల కోసం అయోధ్యకు వచ్చే భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అయోధ్య రైల్వే స్టేషన్ ను విస్తరించారు.