Assembly Elections 2023: మోదీపై విమర్శలు.. ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు

మోదీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమకు ఫిర్యాదు అందిందని, అందుకు సమాధానం చెప్పాలని ప్రియాంకు పంపిన ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది.

Assembly Elections 2023: మోదీపై విమర్శలు.. ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు

Updated On : November 14, 2023 / 9:29 PM IST

Priyanka Recieved Notice From EC: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. మోదీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమకు ఫిర్యాదు అందిందని, అందుకు సమాధానం చెప్పాలని ప్రియాంకు పంపిన ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది.

ఎన్నికల సంఘం ప్రియాంక గాంధీకి పంపిన నోటీసులో “భారతీయ జనతా పార్టీ నుంచి తేదీ 10.11.2023 (కాపీ జతచేయబడింది) న ఫిర్యాదు వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సేవర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చింది. ముంబయిలో ఒక బహిరంగ ర్యాలీని ఉద్దేశించి, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ప్రకటనలు చేసారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రధానమంత్రి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని ఫిర్యాదులో తెలిపారు’’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: దక్షిణ గాజాను వదలని ఇజ్రాయెల్.. స్మశాన వాటికగా మారిన అతిపెద్ద ఆసుపత్రి

ఎన్నికల సంఘం నోటీసు ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. “మోదీ జీ, మాకు ఉపాధి కల్పించింది BHEL. దాని కారణంగా దేశం బాగుపడింది. కానీ దేశ ప్రజలకు ఉపాధి కల్పించే ప్రభుత్వ సంస్థల్ని ఎవరికి ఇచ్చావో చెప్పు? నీ బడా పారిశ్రామిక వేత్త స్నేహితులకు ఎందుకు ఇచ్చావో చెప్పు?’’ అని అన్నారు.

ఎన్నికల కమిషన్ నోటీసులో “ఒక సీనియర్ నేత, అది కూడా ఒక జాతీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్ చెప్పే మాటలు నిజమని ప్రజలు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో రుజువులు లేకుండా మాట్లాడటం సరికాదు. వాస్తవిక ప్రాతిపదికను కలిగి ఉండాలి. తద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టించే అవకాశం ఉండదు’’ అని పేర్కొన్నారు. “కాబట్టి, ఇప్పుడు మీరు ఏదైనా ఇతర జాతీయ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్‌పై చేసిన ప్రకటనపై వివరణ ఇవ్వాలి. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ నవంబర్ 16, 2023న 20:00 గంటలలోపు కారణాన్ని తెలియజేయాలని కోరుతున్నారు’’ అని పేర్కొన్నారు.