Child Rapist : అమ్మేది గుట్కాలు.. చేసేది రేప్‌లు.. ఫోన్ చూసి పోలీసులే షాక్

అతడో సీరియల్ రెపిస్ట్.. చిన్నారులే టార్గెట్.. ఐదుగురు బాలికలపై అత్యాచారం చేశాడు. ఆ ఘాతుకాన్ని ఫోన్ కెమెరాలో వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోలే అతడి ఉన్మాదాన్ని బయటపెట్టాయి.

Child Rapist : అమ్మేది గుట్కాలు.. చేసేది రేప్‌లు.. ఫోన్ చూసి పోలీసులే షాక్

Probing Illegal Gutkha Sale, Chennai Police Get Hold Of Pedophile

Updated On : August 31, 2021 / 11:08 AM IST

Probing illegal Gutkha Sale : అతడో సీరియల్ చైల్డ్ రెపిస్ట్.. చిన్నారులే అతడి టార్గెట్.. ఇప్పటివరకూ ఐదుగురు బాలికలపై అత్యాచారం చేశాడు. ఆ ఘాతుకాన్ని ఫోన్ కెమెరాలో వీడియో రికార్డు చేయడం అలవాటు. ఇప్పుడు ఆ వీడియోలే అతడిలో దాగిన ఉన్మాదాన్ని బయటపెట్టాయి. రాష్ట్రంలో నిషేధిత గుట్కా విక్రయించేవారిపై చెన్నై పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో సాఫ్ట్ డ్రింక్, గుట్కా విక్రయదారుడి షాపులో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో 48ఏళ్ల పెరుమాళ్ అనే వ్యక్తిని అరెస్ట్ పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఫోన్‌‌లో 50 వీడియోలు.. అత్యాచారం చేసింది ఇతడే :
విచారణలో భాగంగా అతడి ఫోన్ చెక్ చేసిన చెన్నై పోలీసులు షాక్ అయ్యారు. ఫోన్ ఫొటో గ్యాలరీలో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన 50 అశ్లీల వీడియోలను గుర్తించారు.  మొదట నిందితుడు, చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసి ఉంటాడని అనుకున్నారు. ఆ తర్వాతే తెలిసింది.. అతడో సీరియల్ చైల్డ్ రేపిస్ట్.. ఆ వీడియోలను నిశితంగా పరిశీలించగా.. అందులో అత్యాచారం చేస్తున్న అతడేనని గుర్తించి పోలీసులు కంగుతిన్నారు. ఇప్పటివరకూ ఐదుగురు మైనర్లపై అత్యాచారం ఇతడే చేశాడనని గుర్తించారు. నిందితుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడేళ్ల నుంచి చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతూ ఆ వీడియోలను రికార్డు చేస్తున్నాడని విచారణలో నిందితుడు అంగీకరించాడు.
Accident :నెత్తురోడిన రోడ్లు, రాజస్థాన్ లో 11 మంది, బెంగళూరులో ఏడుగురు మృతి

తల్లుల సహకారంతోనే అత్యాచారం :
అందులో రెండు అత్యాచార కేసులు మరింత దారుణంగా ఉన్నాయి. తమ కుమార్తెలపై అత్యాచారానికి తల్లులే సహకరించినట్టు తేలింది. 28ఏళ్లు నుంచి 30ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాటికి అత్యాచారానికి గురైన ఐదుగురు చిన్నారుల్లో 4ఏళ్లు, 9ఏళ్లు, 11ఏళ్లు, 13ఏళ్లు, 15ఏళ్లు వారే ఉన్నారు. వీరందరని పోలీసులు రక్షించారు. గత శనివారం కిరాణా షాపులో గుట్కా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో షాపుపై దాడి చేసి పొగాకు ఉత్పత్తుల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా డీలర్ల వివరాల కోసం నిందితుడు పెరుమాళ్ నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పెరుమాళ్ అసలు బండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసు బృందం పెరుమాళ్‌ను విచారించింది. ఈ విచారణలో పెరుమాళ్ గత ఆరు నెలలుగా మైనర్లపై పదేపదే అత్యాచారం చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించాడు.

నిందితుడికి సహకరించిన ఇద్దరు మహిళల్లో ఒకరితో పెరుమాళ్ కు ఎఫైర్ ఉంది. ఆమె తన సోదరిని పెరుమాళ్‌కు పరిచయం చేసింది. తన దుకాణంలో కొన్న వస్తువులకు బదులుగా తమ పిల్లలపై అత్యాచారం చేయడానికి మహిళలిద్దరూ అంగీకరించారని పెరుమాళ్ పోలీసులకు చెప్పాడు. ఆ ఇద్దరు పిల్లలతో పాటు వారింట్టో ఆడుకోవడానికి వచ్చిన చిన్నారులు, ముగ్గురు స్నేహితులపై కూడా అత్యాచారానికి చేసి వీడియో తీశాడు. ఆ వీడియోను చూసిన పోలీసులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆరు నెలల నుంచి తమపై అత్యాచారం చేస్తున్నా తమ తల్లిదండ్రులకు చెప్పడం తెలియని పసి వయస్సు వారిదని డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్ అన్నారు.
Mystery Viral Disease : యూపీలో అంతుచిక్కని వ్యాధితో 39 మంది మృతి.. 32 మంది చిన్నారులే!