Mystery Viral Disease : యూపీలో అంతుచిక్కని వ్యాధితో 39 మంది మృతి.. 32 మంది చిన్నారులే!
యూపీలో అంతుచిక్కని వ్యాధి బెంబేలిత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. మృతుల్లో 32 మంది చిన్నారులు ఉండగా.. ఏడుగురు వృద్ధులు ఉన్నారు.

Mystery Viral Disease
Mystery Viral Disease : దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో యూపీలో అంతుచిక్కని వ్యాధి బెంబేలిత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. మృతుల్లో 32 మంది చిన్నారులు ఉండగా.. ఏడుగురు వృద్ధులు ఉన్నారు. గతవారం నుంచి ఫిరోజాబాద్ జిల్లాలో విషజ్వరం విజృంభిస్తోంది. లక్షణాలను పరిశీలిస్తే.. అచ్చం డెంగ్యూ జ్వరం మాదిరిగానే కనిపిస్తోంది. ఇప్పటివరకూ యూపీలోని ఎనిమిది నుంచి తొమ్మిది జిల్లాలను ఈ వ్యాధి వణికిస్తోంది. జ్వరంతో చాలామంది బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ఈ అనుమానిత జ్వరం బారినపడిన వారి కోసం ఫిరోజాబాద్ ఆస్పత్రుల్లో కొవిడ్-19 వార్డులను ప్రత్యేకంగా వార్డులుగా రిజర్వ్ చేశారు. మెడికల్ కాలేజీలో ఈ జ్వరంతో ముగ్గురు మరణించారు. మొత్తంగా 32 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు ఈ అనుమానిత విషజ్వరంతో మరణించారు. ఆస్ప్రతుల్లో చేరిన బాధితులను, వారి కుటుంబాలను రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ వెళ్లి పరామర్శించారు.
డెంగ్యూ కారణంగా 39 మంది మరణించారనే వార్తలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మరణాలను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ బృందం ప్రభుత్వ నిఘా బృందం పరిశీలిస్తుందని సీఎం యోగి చెప్పారు. స్థానిక స్థాయిలో అవగాహన లేకపోవడం వల్లే.. బాధితులను ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు తీసుకెళ్లినట్టు తెలిపారు. రోజురోజుకీ విషజ్వరం కేసులు పెరిగిపోవడంతో ఆరోగ్య శాఖ, రాష్ట్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తోందని సీఎం ఆధిత్యనాథ్ తెలిపారు. అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రిలో చేరిన చిన్నారులను సీఎం సందర్శించారు. పిల్లలకు సరైన చికిత్స అందేలా చూడాలని వైద్యులకు ఆయన సూచించారు. ఆగస్టు 18న విషజ్వరం మొదటి కేసును గుర్తించారు. ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లలో ట్రీట్ మెంట్ తీసుకున్నారని తెలిపారు.
COVID-19 ఇన్ఫెక్షన్.. అత్యంత తీవ్రమైన అంటువ్యాధిగా ఎప్పుడు మారుతుందంటే?
జ్వరం కేసులు పెరగడంతో జిల్లా యంత్రాంగం పీడియాట్రిక్ ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేసింది. గత రెండు రోజుల్లో ముగ్గురు పిల్లలు మరణించారు. జ్వరంతో చేరిన ముగ్గురు పిల్లలలో ఇద్దరు చనిపోయారు. కొంతమంది రోగుల శాంపిల్స్‌ను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాలని ఆదిత్యనాథ్ సూచించారు. సుదామా నగర్‌లోని ఆస్పత్రులను కూడా యోగి సందర్శించారు. అక్కడ కూడా విషజ్వరం కేసులు పదుల సంఖ్యలో నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ, మునిసిపల్ బాడీ పారిశుధ్యానికి సంబంధించిన సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. జిల్లాలో అనేక డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయని ఆరోపించారు.
బీజేపీ చెందిన ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీష్ అసిజా గత వారం రోజులుగా జిల్లాలో డెంగ్యూ కారణంగా 40 మందికి పైగా పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఆగస్టు 22నుంచి 23 వరకు డెంగ్యూ కారణంగా ఫిరోజాబాద్‌లో 40 మందికి పైగా పిల్లలు మరణించారు. మరో ఆరుగురు పిల్లలు విషజ్వరంతో మరణించారని తెలిసిందని, వారిలో చాలామంది 4ఏళ్ల నుంచి 15ఏళ్ల వయస్సు పిలల్లే ఉన్నారని అన్నారు. మరోవైపు.. యూపీలో విషజ్వరం మరణాలపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు.
Covid Cases: భారత్‌లో కరోనా వైరస్: 24 గంటల్లో 45వేలకు పైగా కేసులు