Covid Cases: భారత్‌లో కరోనా వైరస్: 24 గంటల్లో 45వేలకు పైగా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.

Covid Cases: భారత్‌లో కరోనా వైరస్: 24 గంటల్లో 45వేలకు పైగా కేసులు

indiawide corona cases upadate

Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరువగా కనిపిస్తున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు వస్తుంది అంటూ వార్తలు వస్తున్నవేళ.. గత 24 గంటల్లో 45వేల 83 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశంలో 460 మంది ప్రాణాలు కోల్పోగా.. 35,840 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షల 68వేల 558గా ఉంది. రికవరీ రేటు 97.53 శాతానికి చేరుకోవడం ఉపశమనం కలిగించే విషయం. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో సాధారణ సంఖ్యలో కేసులు నమోదవుతోన్నప్పటికీ, రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా కరోనా తీవ్రత కనిపిస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల్లో రోజువారీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రత్యేకించి కేరళలో కరోనా విజృంభణ పీక్‌లో ఉంటోంది. 30 వేలకు పైగా కొత్త కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల సంఖ్యతో పోల్చుకుంటే.. సగానికి పైగా కేరళ నుంచే వస్తున్నాయి.

వరుసగా నాలుగో రోజు 40 వేలకు పైగా కేసులు:
దేశంలో నాలుగో రోజు వరుసగా 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 46వేల 164కేసులు, శనివారం 44వేల 658కేసులు, 46వేల 759 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం కేరళ. కేరళలో వరుసగా నాల్గవ రోజు శనివారం కూడా 30 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఇక కేరళతో పాటు, మహారాష్ట్ర, మిజోరాం, తమిళనాడు మరియు కర్ణాటకలో కూడా కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా మార్గదర్శకాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. పండగ సీజన్‌లో అదనపు జాగరూకతతో ఉండాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఆగస్టు 28వ తేదీ వరకు, 63 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆగస్టు 28వ తేదీ వరకు, దేశవ్యాప్తంగా 63 కోట్ల 9 లక్షల 17 వేల డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 4లక్షల 37వేల 830మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌ దేశాలు అత్యధిక మరణాలను నమోదు చేశాయి.