రైల్లో శానిటరీ ప్యాడ్స్ కోసం యువతి పిటిషన్ : భారీ స్పందన

అనుకోకుండా రైలు ప్రయాణంలో తాన్వి మిశ్రా అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మెన్సెస్ వచ్చింది. నరక యాతన అనుభవించింది. ఈ సమస్యకు ఏం చేయాలో ఆలోచించింది. తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడరాదన్న ఉద్దేశంతో 'చేంజ్ డాట్ ఆర్గ్' మాధ్యమంగా ఓ పిటిషన్ ను పోస్ట్ చేసింది. వేలాదిమంది మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 08:12 AM IST
రైల్లో శానిటరీ ప్యాడ్స్ కోసం యువతి పిటిషన్ :  భారీ స్పందన

Updated On : January 31, 2019 / 8:12 AM IST

అనుకోకుండా రైలు ప్రయాణంలో తాన్వి మిశ్రా అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మెన్సెస్ వచ్చింది. నరక యాతన అనుభవించింది. ఈ సమస్యకు ఏం చేయాలో ఆలోచించింది. తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడరాదన్న ఉద్దేశంతో ‘చేంజ్ డాట్ ఆర్గ్’ మాధ్యమంగా ఓ పిటిషన్ ను పోస్ట్ చేసింది. వేలాదిమంది మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు.

గోరఖ్ పూర్  : ప్రకృతి సహజంగా మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అదే Menses (నెలసరి, బహిష్టు) సమస్య. దీంతో మహిళలు పలు ఇబ్బందులకు గురవుతుంటారు. బైటకు చెప్పుకోలేని ఇటువంటివి ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ క్రమంలో అనుకోకుండా రైలు ప్రయాణంలో తాన్వి మిశ్రా అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు అటువంటి సమస్యే వచ్చింది. నరక యాతన అనుభవించింది. సరైన డేట్ కాకపోయినా వచ్చిన ఈ సమస్యకు ఏం చేయాలో ఆలోచించింది. 14 గంటలు రైలులోని ప్రయాణించాల్సిన పరిస్థితి.  తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడరాదన్న ఉద్దేశంతో ‘చేంజ్ డాట్ ఆర్గ్’ మాధ్యమంగా ఓ పిటిషన్ ను పోస్ట్ చేసింది. దీనికి ఆమెకు వేలాదిమంది మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు.
 

మూడు వారాల క్రితం రైలు ప్రయాణంలో తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆమె వివరించింది. గోరఖ్ పూర్ నుంచి బయలుదేరే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైల్లో నేను ప్రయాణిస్తున్న క్రమంలో తనకు పీరియడ్ వచ్చిందనీ..వెంటనే పక్కనున్న మరో మహిళలను శానిటరీ ప్యాడ్ వుందాని అడగగా..’నా దగ్గర లేదు. నువ్వే వెంట తెచ్చుకోవాలిగా? రైల్లో ప్యాడ్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ ఓ  టిష్యూ పేపర్ తీసుకో’ అని వచ్చిందని తెలిపారు తాన్వి. అనుకోకుండా పీరియడ్స్ వచ్చింది.. 14 గంటల ప్రయాణం. ఏం చేయాలో తెలీక ప్రయాణ చేసినంతసేపూ..కదలకుండా  బండరాయిలా  కూర్చోవాల్సి వచ్చిందని వాపోయింది. 
 

అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో తన ప్రయాణం తొందరగా పూర్తవ్వాని..భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాననీ..ప్పుడే అనిపించింది… రైల్లోనే ప్యాడ్ వెండింగ్ మెషీన్ ఉంటే బాగుండుననిపించింది” ఆ ఆలోచనతోనే ‘చేంజ్ డాట్ ఆర్గ్’ ‘చేంజ్ డాట్ ఆర్గ్’ పిటిషన్ పెట్టానని..దానికి ఇప్పటికే 8 వేల మంది సంతకాలు చేశారని తెలిపింది. 
 

దీనిపై రైల్వే శాఖ కూడా స్పందించింది.ఇప్పటికే రైళ్లలో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైందని రైల్వే శాఖ  తెలిపింది. 36 రైళ్లలో ఇవి ఉన్నాయని, మిగతా రైళ్లలోనూ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఓ సమస్య పలువురు సమస్యలకు పరిష్కారాన్నిస్తుందనేదానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సమస్య రానిదే పరిష్కారం లేదు అన్నట్లుగా తాన్వికి వచ్చిన సమస్య పలువురు మహిళల సమస్యకు పరిష్కారాన్ని చూపింది.