హోమో సెక్స్ అడిగాడని సీసాతో పొడిచి..

హోమో సెక్స్ అడిగాడని సీసాతో పొడిచి..

Updated On : March 11, 2020 / 10:39 PM IST

ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు ప్రాణం తీసేలా చేసింది. ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజాలకు పోలీసులు షాక్ అయ్యారు. బుధవారం వాడ్గన్ బద్రక్ అనే ప్రాంతంలో ఓ మృతదేహం దొరికింది. విచారణలో అది బందు నిరంజన్ ఇంగ్లేదిగా గుర్తించారు.   

వీరేంద్ర కుమార్ రామ్మిలాన్ సింగ్ అతని స్నేహితుడినే చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారిద్దరూ సిన్హాగడ్ కాలేజీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. రామ్మిలాన్‌ను లైంగిక కోర్కె తీర్చాలంటూ వేధిస్తున్నాడు. విసుగుచెందిన వీరేంద్ర.. స్నేహితుడు నిరంజన్ ను మట్టుబెడదామనుకున్నాడు. 

ప్లాన్ ప్రకారం.. కొండపై ఓ ప్రాంతానికి తీసుకువచ్చాడు. అక్కడే ఓ రాయితో తలపై కొట్టాడు. ఖాళీ బీర్ బాటిల్‌తో పొడిచాడు. అక్కడితో ఆగకుండా శరీరంపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. 

గుర్తు తెలియని 40ఏళ్ల వ్యక్తి మృతదేహం కొండపై దొరకడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిరంజన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రామ్మిలాన్ సింగే హత్య చేశాడని ఎస్ఐ వెల్లడించారు. పూర్తి వివరాలు సేకరణలో భాగంగా కేసుపై విచారణ జరిపిస్తున్నారు. 

See Also | కర్నూలు వైసీపీని విడగొడుతున్న ఇద్దరు వీళ్లే..