Pune : కారుపై కూర్చుని కత్తితో బర్త్ డే కేక్ కట్ చేశాడు.. బర్త్ డే బోయ్ కోసం వెతుకుతున్న పోలీసులు

పుట్టినరోజును ఎవరైనా సంబరంగా జరుపుకుంటారు. కానీ కొందరు విచిత్రంగా జరుపుకుంటూ వైరల్ అవుతున్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పూనెలో ఓ వ్యక్తి కారుపై కూర్చుని కత్తితో కేట్ కట్ చేసి బర్త్ డే చేసుకున్నాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

Pune : కారుపై కూర్చుని కత్తితో బర్త్ డే కేక్ కట్ చేశాడు.. బర్త్ డే బోయ్ కోసం వెతుకుతున్న పోలీసులు

pune

Updated On : June 22, 2023 / 3:46 PM IST

Pune : ఇటీవల కాలంలో పుట్టినరోజు వేడుకలు కూడా విచిత్రంగా సెలబ్రేట్ చేసుకుంటూ జనాలు వైరల్ అవుతున్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేసి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. రీసెంట్‌గా పూనెకి చెందిన ఓ వ్యక్తి కారుపై కూర్చుని కత్తితో కేట్ కట్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు అతగాడి కోసం వెతుకుతున్నారు.

Kerala : కాసేపట్లో పెళ్లి.. వధువుని బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.. సినిమాని తలపించిన క్లైమాక్స్

@namrata_INDIATV అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పూనె సహకార్‌నగర్‌లో జనం గుమిగూడి ఉన్నారు. ఓ వ్యక్తి కారు పైకప్పుపై కూర్చుని కత్తితో కేక్ కట్ చేశాడు. చుట్టూ ఉన్న జనం ‘హ్యాపీ బర్త్ డే’ అని గట్టిగా అరుస్తూ విష్ చేయడం కనిపిస్తుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పోలీసులకు చేరింది. బర్త్ డే బోయ్ కోసం పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు.

Bicycle Stunt : రోడ్డుపై ఘోరంగా ఫెయిలైన సైకిల్ స్టంట్.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ పోలీసులు

పుట్టినరోజు అనేది సంబరంగా జరుపుకుంటారు. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించకూడదు. ఇలాంటి చాలా సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పలు సందర్భాల్లో పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి పనులు చేసేవారు చేసుకుంటూ పోతున్నారు. ఇకనైనా పోలీసులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.