CM Burns Power Bills : కరెంట్ బిల్లులు తగులబెట్టిన పంజాబ్ సీఎం

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం విద్యుత్ బిల్లుల కాపీలను తమ రుణమాఫీకి చిహ్నంగా దహనం చేశారు.

CM Burns Power Bills : కరెంట్ బిల్లులు తగులబెట్టిన పంజాబ్ సీఎం

Punjab

Updated On : October 18, 2021 / 8:45 PM IST

CM Burns Power Bills  పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం విద్యుత్ బిల్లుల కాపీలను తమ రుణమాఫీకి చిహ్నంగా దహనం చేశారు. బకాయి విద్యుత్ చెల్లింపులను మాఫీ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు అమలులోకి వచ్చిన నేపథ్యంలో “మేము వాగ్దానం చేశాం..అమలు చేశాం”అని సీఎం చన్నీ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

పంజాబ్ ప్రభుత్వం గత నెలలో 2 కిలోవాట్ల వరకు విద్యుత్ కనెక్షన్ ఉన్న వారి విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బిల్లులు చెల్లించలేని వినియోగదారుల డిస్‌కనెక్ట్ చేయబడిన విద్యుత్ కనెక్షన్‌లు కూడా ఎలాంటి జరిమానా లేకుండా పునరుద్ధరించబడేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ. 1,200 కోట్ల అదనపు భారం పడుతుంది. అంతేకాకుండా ట్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారుల నీటి బిల్లు బకాయిలను మాఫీ చేయాలని కూడా గత నెలలో పంజాబ్ క్యాబినెట్ నిర్ణయించింది.

ALSO READ Subsidy On Fertilisers : రైతులకు గుడ్ న్యూస్..ఎరువులపై సబ్సీడీ పెంపు